తెలంగాణలో అధికారం మాదే.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2022-11-26 11:47 GMT
దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తుల్లో రెండో నేత ఆయన.. మోడీ తర్వాత దేశాన్ని ఏలుతున్న శక్తివంతమైన నేత. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇటు పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీరోల్ పోషిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు.

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై స్పందించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాను తెలంగాణకు వెళతానని అన్నారు. అక్కడి ప్రజల పల్స్ తనకు తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని చెప్పారు.  తప్పనిసరిగా మార్పు వస్తుందని అన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఆయన మూడు విడతలుగా పాదయాత్రను పూర్తి చేశారు. ఇంకో పాదయాత్రకు నడుం బిగించారు.

ఇక ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అందరినీ కమలం గూటికి చేర్పించే బాధ్యతను బీజేపీ నేతలు భుజానకెత్తుకున్నారు. ఎలా చేసైనా సరే వచ్చేసారి రాజ్యాధికారమే లక్ష్యంగ ాసాగుతున్నారు.

రెండు సార్లు గెలిచిన కేసీఆర్ కు వచ్చేసారి గెలవడం కష్టమేనని అంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. మరి దాన్ని అధిగమించి అధికారి సాధిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News