నేనేం చెబితే దానికి వంతపాడాలి. లేదంటే.. నోరు మూసుకొని ఉండాలి. అంతేకానీ.. వ్యతిరేకంగా మాట్లాడినా.. విమర్శించినా.. తప్పు పట్టినా ఊరుకునేది లేదు? అన్నట్లు వ్యవహరించటం రాజకీయ నేతలకు.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇప్పుడు అలవాటుగా మారాయి.కానీ.. ఇలాంటి తీరు.. సామాన్య ప్రజల్లోనూ కనిపించటం ఇప్పుడు నమ్మశక్యంగా లేదన్న మాట వినిపిస్తోంది.
ఇందుకు మిర్యాలగూడ అమృత వ్యవహారాన్ని చూపిస్తున్నారు. ఒక ప్రేమజంట పెళ్లి చేసుకోవటం.. అది నచ్చక అమృత తండ్రి.. తన కుమార్తె పెళ్లి చేసుకున్న వ్యక్తిని కిరాయి మూకకు సుపారీ ఇచ్చి హత్య చేయించటం.. అది కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే.
హత్యను అందరూ ఖండించారు. అయితే.. తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన తన తండ్రిని ఊరి తీయాలంటూ అమృత చేసిన వ్యాఖ్యలతో పాటు.. సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలు హాట్ టాపిక్ గా మారటం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.
అమృతకు అండగా నిలిచిన వారితో పాటు.. ఆమె తీరును తప్పు పడుతూ.. తొమ్మిదో క్లాస్ లోనే ప్రేమ ఏమిటి? లాంటి ప్రశ్నలతో పాటు.. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతూ.. ఆమె తీరును తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా.. తనను అవమానించేలా పోస్టులు పెడుతున్న వారిపై అమృత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అవమానించేలా పోస్ట్ లు పెడితే కేసులు పెడతానని.. అమృత తాజాగా స్పష్టం చేస్తున్నారు. ప్రణయ్ హత్య ఉదంతంలో రాజకీయ.. ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున వెళ్లి ఆమెను పరామర్శించటం.. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవటం తెలిసిందే.
అమృతకు ఆర్థిక సాయంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం.. ఇల్లు.. భూమి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనిపై కొందరు సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వాటిపై కేసులు పెడతానని.. కోర్టుకు ఈడుస్తానంటూ అమృత తాజాగా మండిపడింది. అమృత మాత్రమే కాదు.. ఆమెకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై ఆమె అత్తమామలు.. సన్నిహితులు.. స్నేహితులు సైతం తప్పు పడుతున్నారు.