70 ఏళ్ల వృద్ధ అమెరికన్ అతడు.. కరోనా బారినపడ్డాడు. చావు చివరి అంచుల వరకు వెళ్లాడు. చివరకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి చికిత్సతో బతికి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ ఆస్పత్రి బిల్ చూసి ఆ వృద్ధుడి గుండె గుభేల్ మంది. ఆస్పత్రి ఖర్చులు ఏకంగా 1.1 మిలియన్ డాలర్లు చూసి అతడు షాక్ అయ్యాడు.
నార్త్ వెస్ట్రన్ సిటీకి చెందిన మైకేల్ ఫ్లోర్ అనే 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకడంతో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే 62రోజుల పాటు మైఖేల్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఒక సమయంలో మరణానికి దగ్గరగా వచ్చాడు. నర్సులు బతకడని అతడి భార్యకు ఫోన్ చేసి కూడా మాట్లాడించారు. పిల్లలు వీడ్కోలు పలికారు.అయితే డాక్టర్లు అతి కష్టంమీద అతడికి చికిత్స చేసి కరోనా నుంచి కాపాడారు. మే 5న డిశ్చార్జ్ చేశారు.
కోలుకున్న అతడికి నిజంగానే గుండె ఆగినంత పని అయ్యింది. హాస్పిటల్ యాజమాన్యం ఏకంగా 181 పేజీల ఆస్పత్రి బిల్ అతడి చేతిలో పెట్టింది. మొత్తం 11,22, 501.04 డాలర్లు కట్టాలంటూ బిల్లు వేసింది. 42 రోజుల పాటు ఐసీయూలో చికిత్సకు 9736 డాలర్ల చొప్పున.. 29 రోజులు వెంటిలేషన్ పై ఉంచినందుకు 82వేల డాలర్ల బిల్ వేశారు.
అయితే అదృష్టవశాత్తూ అమెరికాలో వృద్ధుల కోసం ప్రభుత్వ బీమా ప్రోగ్రాం ఉండడంతో అతడిపై ఈ భారీ మొత్తం పడలేదు. మెడికల్ ఇన్సూరెన్స్ లో ఈ బిల్లు చెల్లించారు. తన జేబులోంచి కట్టకుండానే ఆ వృద్ధుడు బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.