ఏపీలో టెన్షన్: సచివాలయ ఉద్యోగికి కరోనా

Update: 2020-04-29 06:00 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తృతంగా ప్రబలుతుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీరోజు 50కి పైగానే కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1259 నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్ స్పాట్ గా మారిపోయాయి. 75శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్ భవన్ పనిచేస్తున్న నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ సోకిందని చెప్పిన కొద్ది గంటలకే, రాష్ట్ర సచివాలయంలో కీలక విభాగంలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతడికి కరోనా   పాజిటివ్ పరీక్షించాడని తెలుసుకున్న తరువాత,  మొత్తం సచివాలయ ప్రభుత్వం సిబ్బంది  ఆందోళనలకు గురయ్యారు.

సెక్రటేరియట్ ఉద్యోగి తప్పు చిరునామాను అందించాడు. కరోనా అని తెలియగానే పారిపోయాడు. దీంతో వైద్య బృందం అతన్ని ఐసోలేషన్ వార్డుకు పంపే ముందు కొన్ని గంటలు వెతకవలసి వచ్చింది.

ఒక అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడం తో ఆ విభాగం లో ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రారంభంలో అతను ఒక ఏపీ మంత్రికి వ్యక్తిగత సహాయకుడని సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వ్యాపించాయి.కానీ, తరువాత ఇది అవాస్తవమని తేలింది  

ప్రస్తుతం ఇతడు సెక్రటేరియట్లో అటెండర్. ఇతడితో 15 రోజులుగా అక్కడ సంబంధిత అధికారులు కలిసి పనిచేసినట్టు గుర్తించారు. వారిని కూడా క్వారంటైన్ కు తరలిస్తున్నారు..
Tags:    

Similar News