బీహార్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. దీనితో అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటీలో నిలిచిన అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. దర్భాంగ జిల్లాలోని బహదూర్ పుర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాచారి మండల్ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బిహార్ లో వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. దున్నపోతుపై వెళ్లి నామపత్రాలు సమర్పించారు.
ఈ నెల 28న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికల కోసం రకరకాల విన్యాసాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు. బిహార్ శాసనసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది భారత ఎన్నికల కమిషన్. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ 144 కాంగ్రెస్ 70 లెఫ్ట్ పార్టీలు 29 చోట్ల పోటీ చేస్తున్నాయి. అటు అధికార ఎన్డీఏలో జేడీయూ 122 బీజేపీ 121 స్థానాల్లో పోటీకి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది.