నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనం బ్రదర్స్‌లో వివేకానందరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక, ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ప్రస్తుతం వైసీపీలోఉన్నారు. ఇక, ఇప్పుడు ఆయనకు అధిష్టానం పొగబెట్టింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనం ముందు ఉన్న దారులు ఏవీ? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు రెండు మార్గాలు ఆనం ముందు ఉన్నాయని అంటున్నారు పరిశీలకు లు. ఒకటి.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలోకి వెళ్లడం.. రెండు ఎన్నికల మాట ఎలా ఉన్నా.. రాజకీయంగా ఉంటే చాలని అనుకుంటే బీఆర్ ఎస్ వైపు మళ్లడం. ఈ రెండు కాకుండా.. మరో మార్గం ఆయనకు లేదు. లేకపోతే.. బీజేపీలో కి వెళ్లే ప్రయత్నం చేసినా.. నెల్లూరులో బీజేపీ హవా పెద్దగా లేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఎక్కువ భాగం.. ఆనం టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆనం.. తర్వాత 2014 ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. తర్వాత టీడీపీలోకి వచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన నామినేటెడ్ పదవిని ఆశించారు. అయితే.. అది దక్కలేదు. పైగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద సోదరుల ఎఫెక్ట్‌తో ఆయన రాజకీయంగా నలిగిపోయారు.
ఈ క్రమంలో వైసీపీలోకి వచ్చారు. వెంకటగిరి టికెట్‌పై గెలిచారు. కానీ, తనకు తాను చేసుకున్న, తీసుకు న్న గొయ్యి కారణంగా..ఇ ప్పుడు పార్టీ నుంచి బయటకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇక, ఈ క్రమంలో ఆనం.. టీడీపీవైపు వెళ్తే.. అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది.
ఆయన కోరుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గం దక్కుతుందా? లేదా.. అన్నది పక్కన పెడితే.. గెలుపు గుర్రం ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. ఇది కాదని బీఆర్ ఎస్ బాట పడితే.. ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉన్నా.. రాష్ట్రంలో ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది మాత్రం ఒకింత సందేహమే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.