రాజకీయాలన్నాక పార్టీలు మారడం...కర్చీఫ్ మార్చినంత సులువుగా పార్టీ కండువాలు మార్చడం....కామన్. ఓ రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో జంప్ జిలానీలకే ప్రాధాన్యత ఎక్కువగా దక్కుతోంది. ఏపీ - తెలంగాణలలో గో..పి...లు ఏకంగా మంత్రులు కూడా అయిన దాఖలాలున్నాయి. అయితే, పార్టీ మారిన నేతలు సైలెంట్ గా వేరే పార్టీ కండువా కప్పుకోవడం....ఆ జెండా పట్టుకొని ఫొటోలకు పోజులివ్వడం సాధారణం. కానీ, నెల్లూరు రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తోన్న ఆనం రామ్ నారాయణ్ రెడ్డి....పార్టీ మారబోతోన్న వైనం ఇపుడు హాట్ టాపిక్ అయింది. త్వరలో వైసీపీలో చేరబోతోన్న ఆనం....టీడీపీ కండువా - ఐడీ కార్డును పార్టీ ఆఫీసుకు కొరియర్ చేయడంతో తెలుగు తమ్ముళ్లు షాకయ్యారట. గతంలో ఏ లీడర్ చేయని విధంగా....సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన ఆనం...ఇపుడు నెల్లూరులో చర్చనీయాంశమయ్యారు.
టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆనం వైసీపీకి జై కొట్టారు. ఇప్పటికే జగన్ ను కలిసిన ఆనం...అధికారికంగా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆత్మకూరు నుంచి పోటీ చేయాలనుకుంటోన్న ఆనంకు లైన్ క్లియర్ కాలేదట. అక్కడ సిట్టింగ్ గా మేకపాటి గౌతమ్....జగన్ కు సన్నిహితుడు. దీంతో, ఆల్రెడీ ఆత్మకూరు టికెట్ ను గౌతమ్ కన్ ఫర్మ్ చేసుకున్నారట. దీంతో, వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని....పార్టీలో చేరేముందు ఆ హామీ ఇస్తే బాగుంటుందని అన్నారట. అయితే, వెంకటగిరి టికెట్ కోసం ఇప్పటికే ముగ్గురు ఆశావహులు కర్చీఫ్ వేసి ఉంచారట. వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జ్ కొమ్మికెడ్డి రాఘవేంద్ర రెడ్డి ....ఆ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారట. మరోవైపు, రాంప్రసాద్ రెడ్డి....ఒక్క చాన్స్ ....అంటూ జగన్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇక తాజాగా, నేదురుమల్లి వారసుడు రామ్ కుమార్ రెడ్డి....వైసీపీలోకి చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వెంకటగిరిపై ఇంతమంది ఆశావహులు...కర్చీఫ్ లు వేసిన నేపథ్యంలో ఆనంకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అందుకే ఆయన ఇంకా వైసీపీలో చేరకుండా వెయిటింగ్ లో ఉన్నారని టాక్. అయితే, తన టికెట్ కోసం ఇంత వెయిట్ చేస్తోన్న ఆనం....నెల్లూరులో గతంలో మాదిరి చక్రం తిప్పగలరా అని చర్చలు జరుగుతున్నాయట. ఏది ఏమైనా...ఇపుడు నెల్లూరులో ఆనం కొరియర్...వెంకటగిరి టికెట్...హాట్ టాపిక్ అయ్యాయట.