స‌భ‌లోనూ స‌ర్కారును ఇబ్బంది పెట్టాలా ఆనం సార్‌...!

Update: 2022-03-12 10:30 GMT
అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేల తీరు.. విరుద్ధంగా ఉంది. త‌మ‌కు న‌చ్చితే ఒక ర‌కంగా.. న‌చ్చ‌క‌పోతే.. మ‌రో ర‌కంగా.. పార్టీని ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీలోనూ.. ఎ మ్మెల్యే ఒక‌రు.. పార్టీని స్వ‌యంగా ఇబ్బందుల్లోకి నెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యం సీఎం స్వ‌యంగా విన‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మా వేశాల్లో ఇటీవ‌ల మృతి చెందిన నేత‌ల‌కు నివాళుల‌ర్పించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ క్ర‌మంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ సీఎం రోశ‌య్య‌కు కూడా నివాళుల‌ర్పించారు.

అయితే.. రోశ‌య్య గురించి నివాళుల‌ర్పించే కార్య‌క్ర‌మంలో ఆయ‌న గురించి ఎంత మాట్లాడుకున్నా.. ఇంకా మిగిలిన అంశాలు చాలానే ఉన్నాయి. అయితే.. నెల్లూరుకు చెందిన వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఈ వేదిక‌ను కూడా త‌న అసంతృప్తి రాజ‌కీయాల‌ను బ‌య‌ట పెట్టుకునేందుకు వినియోగించుకున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రోశ‌య్య ఎప్పుడూ.. ఓవ‌ర్ డ్రాఫ్టుకు వెళ్ల‌లేద‌ని.. ఆయ‌న అన్ని చ‌క్క‌గా నిర్వ‌హించార‌ని చెప్పుకొచ్చారు. అంటే.. ప‌రోక్షంగా ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారు స‌భావేదిక‌పైనే త‌ప్పుబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌త్య‌ర్థి మీడియా బాగా వాడుకుని.. హైలెట్ చేసింది. అయితే.. ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని.. ఎమ్మెల్యే ఆనం ను సొంత పార్టీ నేత‌లే ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే.. రోశ‌య్య గురించి.. తెలిసిన వ్య‌క్తిగా ఆయ‌న అనేక అంశాల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం ఉన్నా.. కేవ‌లం ఓవ‌ర్ డ్రాఫ్టు గురించే ప్ర‌స్తావించ‌డం ద్వారా.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఉన్న అక్క‌సును ఆయ‌న వెళ్ల‌గ‌క్కార‌ని.. సొంత పార్టీ నేత‌లే అంటున్నారు.

sనిజానికి కొన్నాళ్లుగా ఆనం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. అయితే.. స‌భా వేదిక‌గా .. ఇలా వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్ట‌డం స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు.

నిజ‌మే.. రోశ‌య్య ఓవ‌ర్ డ్రాఫ్టుకు వెళ్లలేదు. దీనికి కార‌ణం కూడా ఉంది. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉండ‌డంతో అవ‌స‌ర‌మైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్రం ఎక్క‌డిక‌క్క‌డ బిగించేస్తుండ‌డంతో అన్ని రాష్ట్రాల ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది. సో.. ఏపీ చేస్తున్న అప్పుల‌ను పెద్ద‌విగా చేసి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు మేధావులు. ఈ నేప‌థ్యంలో ఆనం హుందాగా ప్ర‌వ‌ర్తించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.
Tags:    

Similar News