రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పేరు చెప్పిన వెంటనే గుర్తు పట్టే నేతల్లో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకనందరెడ్డి ఒకరు. విలక్షణమైన వ్యక్తిత్వంతో పాటు.. భోళాగా మాట్లాడే ఆయన తత్త్వం.. ఎవరేం అనుకున్నా.. తాను ఎలా ఉండాలో అలానే ఉండే తీరు ఆయన సొంతం. ఎవరో ఏదో అనుకుంటారని తన శైలిని మార్చుకోవటం ఆయనకు మా చెడ్డ చిరాకు.
ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. నాకు నచ్చినట్లే ఉంటానన్నట్లు ఉండే ఆయనపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఒక ప్రజాప్రతినిధి ఇలా ఉంటారా? అంటూ సటైర్లు వేస్తూ కథనాలు పబ్లిష్ అయ్యాయి. అదంతా ఒకప్పుడు. అదే వివేక ఇప్పుడు నీరసంగా.. డస్సిపోయి.. ఆసుపత్రి బెడ్ మీద చికిత్స పొందుతున్న వైనం చూస్తే అయ్యో అని అనకుండా ఉండలేని పరిస్థితి.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడి బయటకు వచ్చిన కొద్దిమందిలో వివేక ఒకరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టీడీపీలో చేరిన ఆయన తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి తీరుకు భిన్నంగా ఉండే ఆయన.. గడిచిన కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వివేక ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన చంద్రబాబు కిమ్స్ కు వచ్చి ఆయన్ను పరామర్శించారు. బాబు వెంట మంత్రులు నారాయణ.. సోమిరెడ్డి ఉన్నారు. ఎప్పుడూ హుషారుగా.. గలగలలాడే వివేక.. నీరసంతో.. ఏ మాత్రం ఓపిక లేకుండా ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేని స్థితి చూసినప్పుడు అయ్యో.. వివేక ఇలా అయిపోయారే అనుకోకుండా ఉండలేని పరిస్థితి.