టీవీ యాంకర్ శ్యామల భర్త, నటుడు నరసింహారెడ్డిని పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో మహిళను కూడా అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ విషయమై తాజాగా ఓ నేషనల్ వెబ్ సైట్ తో మాట్లాడారట యాంకర్ శ్యామల.
సింధూర రెడ్డి అనే మహిళతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు నరసింహారెడ్డి ఒప్పందం చేసుకున్నారట. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. గండిపేటకు సమీపంలోని నాలుగు ఎకరాల్లో వెంచర్ వేయాలని అనుకున్నారట. ఇందుకోసం కోటి రూపాయల పెట్టుబడి పెట్టాలని ఇద్దరూ అనుకున్నారట.
ఈ ఒప్పందంలో భాగంగా.. మొత్తం రూ.85 లక్షలు చెల్లించిందట సింధూర. ఈ డబ్బుతో స్విమ్మింగ్ పూల్, ఒక పబ్, గేమ్ జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పాడట నరసింహారెడ్డి. అయితే.. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. వెంచర్ పనులు నిలిచిపోయాయని సమాచారం.
అయితే.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని సింధూర రెడ్డి కోరగా.. నరసింహారెడ్డి ఇవ్వలేదట. అంతేకాకుండా.. చంపేస్తానని కూడా బెదిరించారట. ఈ వివరాలన్నీ పేర్కొంటూ సింధూర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిందట.
ఈ విషయంపై నిన్న యాంకర్ శ్యామల స్పందిస్తూ.. తనకు ఈ కేసు గురించి ఏమీ తెలియదని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా జాతీయ వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. కొవిడ్ పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నట్టు తెలిపిందట. ముందుగా.. తన భర్తకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పిందట. నరసింహారెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత.. ఇద్దరమూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఏం జరిగిందనే విషయాన్ని క్లియర్ గా వివరిస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది.