బాబు విజయవాడ వెళ్లడంతోనే అర్థమైపోయింది

Update: 2015-12-19 07:16 GMT
ఏపీ శాసనసభ ఈ రోజు పూర్తిగా వాయిదా పడుతుందని చాలామందికి నిన్నే అర్థమైపోయింది. గుంటూరులో ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వస్తుండడంతో చంద్రబాబు శనివారం ఉదయం విజయవాడ వెళ్లిపోయారు. ఆయన వెంటన పలువురు మంత్రులూ వెళ్లారు. అందరూ ఉన్నప్పుడూ వైసీపీ స్పీడును తట్టుకోలేకపోతున్న సమయంలో చంద్రబాబు - కీలక మంత్రులు లేకుంటే వైసీపీ ఇంకా రచ్చరచ్చ చేసే ప్రమాదముందని పాలక పక్షం భావించి సభను కొద్దిసేపు నడిపి సోమవారానికి వాయిదా వేస్తుందని ముందే ఊహించారు. అనుకున్నట్లుగానే శనివారం సభ కొద్దిసేపు కొనసాగాక సోమవారానికి వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ పై వైసీపీ సభ్యులు శనివారం ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు సభను సోమవారం వాయిదా వేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. అవి ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అంతకుముందు సభ ఒకమారు వాయిదా పడి పది నిమిషాల తరువాత మళ్లీ మొదలైంది. రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని... ఆమె సస్పెన్షన్ ఎత్తేయాలని జగన్ స్పీకర్ ను కోరారు. అనంతరం వైసీపీ సభ్యుల నిరసనలు తీవ్రమవడంతో సభాపతి సోమవారం వరకు వాయిదా వేశారు.
Tags:    

Similar News