మాతో ఉంటూ మ‌మ్మ‌ల్నే తిడ‌తారా?

Update: 2018-03-12 05:17 GMT
ప్ర‌త్యేక హోదాతో పాటు.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఏపీ అధికార‌ప‌క్షం అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. ఇటీవ‌ల కేంద్రంలోని మోడీ స‌ర్కారులో ప‌ని చేస్తున్న త‌మ పార్టీ నేత‌ల్ని కేంద్ర మంత్రుల ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేలా బాబు ఆదేశించ‌టం.. వారు వెంట‌నే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టం తెలిసిందే.

ఏపీ హోదా కోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధ‌మేన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు.. రాజీనామాల‌తో రాజ‌కీయ మైలేజీని సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీకి పెద్ద ఎత్తున కోపం రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఏపీలో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల గురించి వివ‌రించి.. హోదా విష‌యంలో తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న క‌ల‌ర్ ఇచ్చి.. మంత్రి ప‌ద‌వుల నుంచి వైదొలిగినా.. ఎన్డీయే ప్ర‌భుత్వంలోనే తాము కొన‌సాగుతామ‌న్న హామీని ఇచ్చేశారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు త‌మ నేత‌ల చేత రాజీనామా చేసి.. కూటమిలో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. బాబు వైఖ‌రిపై ఏపీ క‌మ‌ల‌నాథులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ పార్టీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. ఏపీకి తమ పార్టీ ఏమీ చేయ‌లేద‌న్న భావ‌న క‌లిగేలా చేయ‌టంలో బాబు స‌క్సెస్ అయ్యారంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో త‌మ పార్టీ తీరుపైనా.. త‌మ‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్న వైనం పైనా వారు అసంతృప్తితో ఉన్నారు.

నిజంగా త‌మ‌తో తెగ‌తెంపులు చేసుకోవాల‌నుకుంటే ప‌ద‌వుల రాజీనామాతో పాటు.. కూట‌మి నుంచి వైదొల‌గాల్సి ఉంద‌ని.. కానీ అదేమీ చేయ‌కుండా కేవ‌లం కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు వ‌దిలేయ‌టం ద్వారా త్యాగ‌ధ‌నుడిగా ఫోజు కొడుతున్న‌ట్లుగా బీజేపీ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ నేత‌ల రాజీనామాల‌తో మైలేజీ సొంతం చేసుకోవ‌టంపై అసంతృప్తితో ఉన్న ఏపీ క‌మ‌ల‌నాథులు.. ఇక‌పై త‌మపైనా.. త‌మ పార్టీపైనా ఏదైనా విమ‌ర్శ‌లు చేస్తే అస్స‌లు త‌గ్గ‌కూడ‌ద‌ని.. ధీటుగా బ‌దులు ఇవ్వాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. త‌మ‌తో ఉంటూ.. త‌మ‌ను తిడుతున్న బాబు వైఖ‌రిని వారు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.  

త‌మ‌తో ఉంటూ త‌మ‌ను తిడుతున్న టీడీపీ నేత‌ల డ‌బుల్‌ స్టాండ్ ను ఎండ‌గ‌ట్టాల‌ని.. ఏపీకి మోడీ స‌ర్కారు ఏం చేసింద‌న్న‌ది పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయానికి వారు వ‌చ్చారు. తాజాగా బెజ‌వాడ‌లో నిర్వ‌హించిన పార్టీ భేటీలో పాల్గొన్న నేత‌లంతా  టీడీపీ నేత‌ల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News