ఇన్ కం ట్యాక్స్.. ఇక ఇంటింటికీ అర్థమయ్యేలా.. చట్టంలో సమూల మార్పులు
రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో విలీనం.. ఏప్రిల్ 1కి బదులు ఫిబ్రవరి 1నే పార్లమెంటుకు సమర్పణ..
రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ లో విలీనం.. ఏప్రిల్ 1కి బదులు ఫిబ్రవరి 1నే పార్లమెంటుకు సమర్పణ.. ప్రణాళికా సంఘాన్ని ఎత్తేసి నీతీ ఆయోగ్.. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్త న్యాయ చట్టాలు.. ఇలా బ్రిటిష్ హయాం నాటి వ్యవస్థల్లో ఒకటికి రెండు కీలక మార్పులు చేస్తూ వస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది.
సాధారణ ప్రజలకు ఒక పట్టాన కొరుకుడు పడని ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ (ఆదాయపు పన్ను చట్టాన్ని) సరళీకరించనుంది. ఇప్పుడున్నది దశాబ్దాల కిందటి చట్టం. దీని స్థానంలో కొత్తదానిని తేనున్నారు. ఈ మేరకు బిల్లును గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందిన ఈ బిల్లులో 526 సెక్షన్లు, 23 ఛాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉన్నాయి.
బిల్లులో పేర్కొన్న ప్రకారం.. ‘ట్యాక్స్ ఇయర్’.. ‘ప్రీవియస్ ఇయర్’ గా మారనుంది. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు లెక్కిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ వ్యవధిలో ఆర్జించిన మొత్తానికి మరుసటి ఏడాది రిటర్న్స్ ఫైల్ చేస్తారు. అయితే, ఇప్పటివరకు ముందు సంవత్సరాన్ని ట్యాక్స్ ఇయర్ అని, పన్ను చెల్లిస్తున్న సంవత్సరాన్ని అసెస్‌మెంట్ ఇయర్ అని అంటున్నారు.
అయితే, కొత్త బిల్లు ప్రకారం.. ట్యాక్స్ ఇయర్ కాస్త ప్రీవియస్ ఇయర్ గా మారనుంది.
టేబుళ్లు, ఫార్ములాలతో బిల్లులోని చాలా అంశాలు సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాక స్టాండింగ్ కమిటీకి పంపుతారు. పార్లమెంట్ ఆమోదం పొందాక వచ్చే ఏడాది అంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇప్పుడున్న ఆదాయ పన్ను చట్టం 1961 నాటిది. ఇందులో 298 సెక్షన్లు ఉంటే.. కొత్త బిల్లులో వాటిని 526 కు పెంచారు. 14 షెడ్యూళ్లను 16 చేయనున్నారు. అయితే, చాప్టర్లు (23) మారడం లేదు. పాత బిల్లు 880 పేజీల్లో ఉంటే.. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. 1961 తర్వాత పలు సవరణలతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్, డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి వాటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్ (
సీబీడీటీ)నే రూపొందించేలా కొత్త బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.