చైనా నోట మళ్లీ అదే మాట.. వూహాన్ లో టెస్టులు చేయలేదు

ప్రపంచాన్ని వణికించటమే కాదు.. కొంతకాలం స్తంభింపచేసిన ఈ మహమ్మారిపై బోలెడన్ని థియరీలు బయటకు రావటం తెలిసిందే.

Update: 2025-02-13 06:30 GMT

ప్రపంచాన్ని వణికించటమే కాదు.. కొంతకాలం స్తంభింపచేసిన ఈ మహమ్మారిపై బోలెడన్ని థియరీలు బయటకు రావటం తెలిసిందే. నిజామా? అబద్ధమా? అన్నది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు నమ్మే అంశం.. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను క్రత్రిమంగా తయారు చేసి.. దాని లీక్ కారణంగా జరగకూడనివెన్నో జరిగినట్లుగా ఆరోపిస్తారు. లక్షలాది మంది ప్రాణాల్ని తీసిన ఈ మహమ్మారికి కారణంగా చెప్పే వూహాన్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షలపై చైనా మరోసారి రియాక్టు అయ్యింది.

వూహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని మరోమారు స్పష్టం చేసింది. సాంక్రమిక వ్యాధుల పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సాయం చేసిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చైనా స్పందించింది. కరోనా వైరస్ మీద తాము పరీక్షలు నిర్వహించలేదని పలుమార్లు ఇప్పటికే చెప్పామంటూ.. పాత పాటను పదే పదే పాడేశారు. ‘‘వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ - ఆఫ్ - ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని ఇప్పటికే తాము పలుమారలు స్పష్టం చేశామని పేర్కొంటూ.. తమదేమాత్రం తప్పు లేదని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.

చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ.. వైరస్ మూలాల్ని కనుక్కోవటంపై వస్తోన్న అన్ని రకాల రాజకీయ ఆరోపణల్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. చైనాలోని వూహాన్ లయాబ్ లో పరిశోధనల కోసం అమెరికా అంతర్జాతీయ డెవలప్ మెంట్ విభాగం ఫండింగ్ చేసిందన్న ఆరోపణలు సైతం అర్థం లేనివిగా కొట్టేస్తున్నారు. అయితే.. ఈ తరహా వాదనల్ని ఇంతకు ముందు పలుమార్లు ప్రకటించిన చైనా.. ఒకవేళ నిజం ఒప్పుకొని చెంపలేసుకుంటే తప్పించి.. దీనిపై ఎంత మాట్లాడినా.. చివరకు వచ్చే ఫలితం మాత్రం పాతదే కావటం గమనార్హం.

Tags:    

Similar News