కేసీఆర్ సమర్థతకు మరో మచ్చ.. సచివాలయం పెచ్చులూడి వాహనం డ్యామేజ్

తెలంగాణ సచివాలయంలోని ఏడో అంతస్తులోని పీవోపీ పార్టిషన్ పెచ్చులూడి కిందకు పడిపోవటం.. ఈ సందర్బంగా అక్కడే నిలిచి ఉన్న ‘కారు’ ధ్వంసం కావటం షాకింగ్ గా మారింది.

Update: 2025-02-13 05:00 GMT

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. ఆయన ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే బీఆర్ఎస్ నేతలకు బ్యాడ్ న్యూస్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. తెలంగాణకు ఐకానిక్ భవనాల్ని నిర్మించిన ఘనత తమదేనని తరచూచంకలు గుద్దుకునే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టే పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సచివాలయంలోని ఏడో అంతస్తులోని పీవోపీ పార్టిషన్ పెచ్చులూడి కిందకు పడిపోవటం.. ఈ సందర్బంగా అక్కడే నిలిచి ఉన్న ‘కారు’ ధ్వంసం కావటం షాకింగ్ గా మారింది.

తాజా పరిణామంతో నిర్మాణ లోపాల మీద అందరి చూపు పడేలా చేసింది తాజా ఉదంతం. సీఎం ఛాంబర్ అంతస్తు వెలుపల ఉన్న పీవోపీ పార్టిషన్ పెచ్చులూడి పడిపోవటం.. అక్కడే నిలిచి ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారు మీద పడ్డాయి. లక్కీగా ఆ టైంలో కారులో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. దీంతో భద్రతా సిబ్బంది అలెర్టు అయ్యారు.

నాణ్యతకు నిదర్శనంగా సచివాలయం నిలుస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న వేళ.. నిర్మాణం పూర్తై రెండేళ్లు మాత్రమే అయిన వేళలో..ఇలా జరగటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ సచివాలయాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ స్పందించింది.అది నిర్మాణం సమస్య కాదని.. కాంక్రీట్ వర్కు కాదని.. స్ట్రక్చర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్ సీ ఫ్రేంగా పేర్కొన్నారు. ఇటీవల కొత్త లైటింగ్.. కొత్త కేబుల్స్ కోసం జీఆర్ ఎసీ డ్రిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిణామం చోటుచేసుకుందని చెబుతున్నారు. ఏమైనా తాజా పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుందున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News