సంస్కార హీనం... చింతమనేనిపై వైసీపీ ఫైర్!

ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు చింతమనేని ప్రభాకర్. ఈ సమయంలో.. వేదిక వద్ద కారు అడ్డంగా ఉందంటూ రెచ్చిపోయారు.

Update: 2025-02-13 05:04 GMT

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలి సంగతి చాలా మందికి తెలిసిందే. ఆయన ఊర మాస్ వ్యవహారాలు చేస్తుంటారని స్థానికులు, తెలిసినవారు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. ఓ కారు డ్రైవర్ పై అందుకున్న బూతు పురాణం ఇప్పుడు నెట్టింట రచ్చగా మారింది.

అవును... చింతమనేని ప్రభాకర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారాలు టీడీపీలోనే చాలా మందికి నచ్చవని చెబుతున్నారు. ఇక.. ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆయన పలువురిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేశాయి! ఈ క్రమంలో తాజాగా ఓ బూతుపురాణం తెరపైకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే... ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు చింతమనేని ప్రభాకర్. ఈ సమయంలో.. వేదిక వద్ద కారు అడ్డంగా ఉందంటూ రెచ్చిపోయారు. ప్రధానంగా.. ఆ కారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అబ్బయ్య చౌదరిది అని అంటున్నారు. ఇ సమయంలో.. ఆ డ్రైవర్ పై చింతమనేని తన పాండిత్య ప్రదర్శించారు. దీనిపై వైసీపీ స్పందించింది.

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతుపురాణం.. పెళ్లి వేదిక వద్ద కారు అడ్డుగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ ని బండ బూతులు తిట్టిన చింతమనేని.. డ్రైవర్ బీసీ కావడంతో మరింత అహంకారం చూపిస్తూ దాడికి ప్రయత్నం.. అని చెబుతూ.. "నువ్వు మారవా.. ఇంకెప్పుడు సంస్కారం నేర్చుకుంటావ్ చింతమనేని..?" అని వైసీపీ ప్రశ్నించింది.

దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ పోస్ట్ చేసింది. అది విన్న నెటిజన్లు చింతమనేనిపై తిట్ల పురాణం అందుకుంటున్నారు. ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి ఇంత నీచంగా, ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లడతారంటూ ప్రశ్నిస్తునారు.

Tags:    

Similar News