ఈ స్తబ్ధత వారికి ఆత్మహత్యతో సమానం

Update: 2018-04-02 23:30 GMT
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలన్నీ హోదా పాట పాడుతూ... తమ రాజకీయ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అధికారం వైపుగా అడుగులు వేయాలని కలలు కంటున్నాయి. కానీ.. ఉన్నట్టుండి హఠాత్తుగా.. ఒక పార్టీని మాత్రం స్తబ్ధత ఆవరించేసింది. అది మరెవ్వరో కాదు.. భారతీయ జనతా పార్టీనే. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ... తెలుగుదేశం పార్టీ మీద ఏ రేంజిలో ఎటాకింగ్ ధోరణిలో వెళ్లాలనే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించగల తెగువ ఇక్కడి నాయకులకు లేదు. ప్రతి విషయమూ అధిష్టానం ఆదేశాల మేరకు నడవాల్సిందే. కానీ అధిష్టానం ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తమకంటూ ఒక్క ఎంపీ సీటు కూడా లేని, వచ్చే అవకాశం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఎలా సర్వనాశనం అయిపోతున్నదో, ఎలా కాపాడుకోవాలో ఆలోచించడానికి వారికిప్పుడు సమయం లేదు. హస్తిన పెద్దలందరూ కూడా కర్నాటక ఎన్నికల్లో ప్రజలను ఎలా బురిడీ కొట్టించాలా? వారిని ఎలా వంచించి.. ఓట్లు దండుకుని అక్కడ అధికార పీఠం ఎక్కాలా? అనే వ్యూహరచనలో నిమగ్నం అయి ఉన్నారు. పాపం... రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నా.. భాజపా నాయకులు మాత్రం సైలెంట్ గానే గడుపుతున్నారు. ఏదో అడపాదడపా సోమువీర్రాజు - పురందేశ్వరి లాంటి గళాలు తప్ప.. వారి యాక్టివిటీ కనిపించడం లేదు.

అసలే చంద్రబాబు సాగించిన మితిమీరిన ప్రచారంతో.. ప్రజల్లో ఇమేజిని సర్వనాశనం చేసుకున్న భారతీయ జనతా పార్టీకి.. ఈ స్తబ్ధత ఆత్మహత్యతో సమానం అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతిలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులు - నిర్మాణ పనులు కేంద్రం యిచ్చే నిధులతో ముడిపడి ఉన్నప్పుడు.. చంద్రబాబునాయుడు అవినీతి వల్లనే తాము వెనుకాడుతున్నాం.. అని, చంద్రబాబు పడగనీడ పక్కకు తప్పుకుంటే కేంద్రానికి పూచీ ఉన్న పనులన్నీ తామే తప్పక పూర్తిచేస్తాం అని.. వారు అధికారిక ప్రకటనలు చేస్తే పార్టీ పరువు కాపాడుకోవడానికి.. తమ  ఇమేజిని చంద్రబాబు మీద ఎదురుదాడితో దెబ్బతీయడానికి వారికి ఆస్కారం ఉంది.

కానీ రాష్ట్ర భాజపా నాయకుల తీరు చూస్తే.. వారు ఇలాంటి ప్రయత్నమేదీ, ఆలోచనేదీ చేస్తున్నట్లు లేదని పలువురు భావిస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగిసేలోగా - మరో చోటా ఎన్నికలు వస్తాయి. ఇలా రోజులు గడచిపోతూనే ఉంటాయి. భాజపా కేంద్ర నాయకత్వం ఏపీ పార్టీ గురించి పట్టించుకోకపోతే గనుక.. ఒకప్పట్లో ఈ రాష్ట్రంలో నెంబర్ టూ పార్టీ కావాలని కలలుగన్న నాయకులు.. పార్టీ అథోగతిని కళ్లజూడాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News