రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ కానీ - పార్లమెంటు సీటును కానీ దక్కించుకోలేని అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీ. ఇప్పుడు దక్కించుకోకపోవడమే కాదు.. గతంలో దక్కించుకున్న సీట్లలో కనీసం ఒక్కదాన్నయినా నిలబెట్టుకోలేని పరిస్థితిలో కునారిల్లుతోంది. అలాంటి పార్టీ ఇప్పుడు రణభేరీ మోగిస్తామంటూ .. పెద్ద పెద్ద ప్రకటనలు వల్లె వేస్తోంది. ఈ నెల అంటే .. అక్టోబరు 4 నుంచి రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంపై రణభేరీ మోగించనున్నట్టు బీజేపీ చీఫ్.. కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అయితే, వాస్తవానికి రాష్ట్రంలో మోగించడానికి ముందు.. కేంద్రంపై ఏమైనా చేస్తే.. ఫలితం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా విషయం పోనీ.. పక్కన పెట్టామని భుజాలు తుడుచుకున్నా.. ప్యాకేజీలో భాగంగా రావాల్సిన పైకం పైనా కేంద్రం నోరు విప్పడం లేదు. ఈ పరిణామాలపై బీజేపీ పెద్దలు మాట్లాడడమో.. లేదా ఇక్కడ మోగిస్తామని చెబుతున్న రణభేరిలు అక్కడ మోగించడమో చేస్తే బాగుంటుందని అంటున్నారు.
ప్రస్తుతం పార్టీ కేడర్ కూడా లేని పరిస్థితిలో పనిలేని నాయకులు ఇప్పుడు ముచ్చటగా మూడు మాసాలు కూడా పూర్తి చేసుకోని జగన్ ప్రభుత్వంపై రణభేరిలు మోగించడం అంటే.. నవ్వుల పాలు కాకతప్పదని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ జగన్ ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేస్తూ కాలం గడుపుతోంది. ఇప్పుడు దీంతో మరో సరికొత్త నాటకానికి రెడీ అవుతున్నట్టే రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యానికి పునాదులు పడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ సంతోష కరమైన పరిస్థితి ఏర్పడనుంది. మరి ఇలాంటి పరిస్థితి చూస్తూ.. కూడా కన్నా వంటి అనుభవజ్ఞులు ఇలా రణభేరి.. అంటే పొద్దుపుచ్చడం - ఏదో ఒకరకంగా మీడియాలో గుర్తింపునకు పాకులాడడం తగ్గించుకుని క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేసుకోవడంపైనో.. లేదా ప్రభుత్వ లోపాలను నిజంగానే ఎత్తి చూపడం పైనో .. దృష్టి పెడితే బెటర్ అని అంటున్నారు పరిశీలకులు.