సీఎం ర‌మేష్‌ కు జ‌గ‌న్ షాక్ గాలేరు న‌గ‌రి టెండ‌ర్ క్యాన్సిల్‌!

Update: 2019-08-30 14:31 GMT
నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు - క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేసి.. రాష్ట్రం లో గుర్తింపు పొందిన నాయ‌కుడు - క‌డప జిల్లాకే చెందిన ప్ర‌స్తుత బీజేపీ నేత సీఎం ర‌మేష్‌ కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. వైసీపీ అధినేత‌ - సీఎం జ‌గ‌న్ తీసుకున్న రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్ణ‌యంలో సీఎం ర‌మేష్‌ కు ద‌క్కిన టెండ‌ర్ ఒక‌టి క్యాన్సిల్ అయింది. వాస్త‌వానికి ఈ టెండ‌ర్‌ ను టీడీపీ హ‌యాంలో దొడ్డిదారిలో ద‌క్కించుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపించింది.

ఇప్పుడు ఎలూగూ త‌క్కువ ధ‌ర‌ల‌కే ప‌లు ప్రాజెక్టుల‌ను నిర్మించాల‌ని చూస్తున్న ప్ర‌భుత్వం ఆ దిశ‌గా చేప‌ట్టిన నిర్ణ‌యంలో బాగంగా గాలేరు-న‌గ‌రి సుజ‌ల శ్ర‌వంతి ప్రాజెక్టుకు సంబంధించిన టెండ‌ర్‌ను కూడా ర‌ద్దు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాయ‌ల సీమ‌కు తాగు - సాగు నీరు అందించే గాలేరు-న‌గ‌రి సుజ‌ల శ్ర‌వంతి ప్రాజెక్టు రెండోద‌శ‌ను అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు టెండ‌ర్లు పిలిచారు. దీనికి నాలుగు కంపెనీలు టెండ‌ర్ల‌లో పాల్గొన్నాయి.

వీటిలో నిబంధ‌న‌లు పాటించ‌లేద‌నే కార‌ణంగా రెండు కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆ వెంట‌నే మ‌రో రెండు కంపెనీల టెండ‌ర్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. వీటిలో సీఎం ర‌మేష్‌ కు చెందిన రిత్విక్ కంపెనీ కూడా ఉంది. మ‌రో కంపెనీ ఎన్‌ సీసీ అయితే - ఇది రిత్విక్ కంపెనీ క‌న్నా 10 శాతం ఎక్కువ‌కు ప‌నులు కోట్ చేసింద‌ని పేర్కొంటూ.. దీనిని కూడా ప‌క్క‌కు త‌ప్పించింది. ఆ వెంట‌నే సీఎం ర‌మేష్‌ కు చెందిన కంపెనీకి ఈ ప‌నులు అప్ప‌గించింది.

ఈ ప్రాజెక్టు ప్ర‌ధాన కెనాల్ వ్య‌యం 180 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ ప‌నులు పూర్తి చేసేందుకు రిత్విక్ కంపెనీ 406.73 కోట్ల‌తో టెండ‌ర్ వేసింది.  అయితే - అప్ప‌ట్లో ఆద‌రాబాద‌రాగా పిల‌వ‌డం వ‌ల్లే.. నిధుల వ్య‌యం పెరిగిపోయింద‌ని - ఎన్నిక‌ల ముందు కావ‌డంతో ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల నుంచి ఓట్లు రాబ‌ట్టుకునేందుకు టెండ‌ర్ల‌ను ఇష్టానుసారంగా అనుమ‌తించింద‌ని పేర్కొంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం .. ఈ టెండ‌ర్‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించింది.

త‌ద్వారా క‌నీసం 54.74 కోట్లు ప్ర‌జా ధ‌నం ఆదా అవుతుంద‌ని అధికారులు లెక్క‌లు తేల్చారు.  ఆ నేప‌థ్యంలోనే సీఎం ర‌మేష్‌ కు చెందిన రిత్విక్ కంపెనీకి చంద్ర‌బాబు హ‌యాంలో ద‌క్కిన టెండ‌ర్‌ ను రేపో మాపో క్యాన్సిల్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో సీఎం ర‌మేష్‌ కు జ‌గ‌న్ భారీ దెబ్బ‌కొట్టార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



Tags:    

Similar News