రిలయన్స్ సంస్థలంటే ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ప్రేమ అని ఏపీ విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కేజీ బేసిన్ లో రిలయన్స్ సంస్థకు మేలు చేసేలా బాబు వ్యవహరించాడని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ విమర్శలను అధికార తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నప్పటికీ తాజాగా ఈ విషయం బహిరంగంగా మరోమారు రుజువు అయిందని అంటున్నారు. ఎందుకంటే..ఏపీలోని చౌక ధరల దుకాణాలకు వస్తువులు సరఫరా చేసే బాధ్యతను రిలయన్స్ - ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా ప్రకటించారు. ఫ్యూచర్ గ్రూపులో ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు కుటుంబానికి వాటాలు ఉన్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను విలేజ్ మాల్స్ గా మార్చి - వాటికి సరుకులను అందజేసే బాధ్యతను రిలయన్స్ - ఫ్యూచర్ గ్రూప్ లకు అప్పగించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో రిలయన్స్ - 3 జిల్లాల్లో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు అన్ని రేషన్ దుకాణాలకు సరుకులను అందజేస్తాయని పేర్కొన్నారు. మొదటగా గుంటూరు అర్బన్ పరిధిలో విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేసి - పంచదార - కందిపప్పు - అవసరం ఉన్న వారికి కిరోసిన్ ఇస్తామని మంత్రి పుల్లారావు వివరించారు. విలేజ్ మాల్స్ లలో మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరతో సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.
కాగా, ఈ పరిణామంపై విపక్షాలు - ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కార్పొరేట్ల సేవల్లో తరిస్తున్న చంద్రబాబు రిలయన్స్ కు సేవ చేసేందుకు కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు ఇటీవలి కాలంలో తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ లో వాటాలు అమ్మిన బాబు...ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ సంస్థకు మేలు చేసే నిర్ణయం తీసుకొని తద్వారా తన జేబు నింపుకునేందుకు రేషన్ షాపులకు సరుకుల సరఫరాను రిలయన్స్‌కు - ఫ్యూచర్ గ్రూప్ కు అప్పగిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో అవినీతి అంటే సహించబోనని ప్రకటించిన బాబు...ఇప్పుడు బహిరంగంగానే..నిబంధనలను తుంగలో తొక్కుతూ తన సొంత సంస్థలకు జేబులు నింపుతున్నారని ఆక్షేపిస్తున్నారు.