అమరావతిలో ట్రామ్‌..!

Update: 2015-05-24 04:58 GMT
దేశంలోని కోల్‌కత్తా నగరం పేరు వినగానే గుర్తుకొచ్చేవి ఒకటి హౌరా బ్రిడ్జ్‌ అయితే రెండోది ట్రామ్‌ వ్యవస్థ. రోడ్డు మీద నుంచే రైళ్లు వెళ్లిపోవటం.. పాదచారులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ఈ ప్రజారవాణా వ్యవస్థకు.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.

ఏపీ రాజధానికి సంబంధించిన ప్రజారవాణా వ్యవస్థ ఏ విధంగా ఉండాలన్న విషయంపై జరిగిన అత్యున్నత సమావేశంలో ట్రామ్‌ను ఏర్పాటు చేయాలని రాజధాని సలహా కమిటీ నిర్ణయించింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా.. కూలీ నుంచి ఉన్నత ఆదాయ వర్గాల వారు వరకూ వినియోగించుకునేలా దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌.. జ్యూరిచ్‌ నగరాల తరహాలోనే అమరావతి నగరంలోనూ ట్రామ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ట్రామ్‌ వ్యవస్థ దశాబ్దాల క్రితం నాటిది. దాని స్థానే కొత్త సాంకేతికతతో.. అమరావతిలో ట్రామ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సో.. ఏపీ కొత్త రాజధాని కొంగొత్తగా ఉండనుందన్న మాట.
Tags:    

Similar News