బాబును ఆంధ్రోళ్లు మ‌ళ్లీ తిడుతున్నారు

Update: 2017-09-25 04:17 GMT
కొన్ని త‌ప్పులు చేయ‌కూడ‌దు. కొన్నిసార్లు మ‌న‌కుంటే వేరే వాళ్లు దూసుకెళ్లొచ్చు. అలాంటి వాటిని అలా చూసి వ‌దిలేసే క‌న్నా.. అందులోని స్ఫూర్తిని తీసుకొని నిర్ణ‌యాలు తీసుకోవ‌టం త‌ప్పేం కాదు. అన్ని ఐడియాలు ఒక‌రికే రావు. ఒక‌రికి వ‌చ్చిన మంచి ఆలోచ‌న‌ను తీసుకొని అమ‌లు చేస్తే ఎవ‌రేం అనుకోరు. ఇలాంటి విష‌యాల్లో చంద్ర‌బాబు తీరును ఆంధ్రోళ్లు త‌ప్పు ప‌డుతున్నారు.

మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. తెలుగు పాల‌కులకు సొంత ప్ర‌జ‌ల్ని.. వారి భావోద్వేగాల్ని  పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న పేరుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పుణ్య‌మా అని ఆ అప‌వాద‌ను తొలిగించే ప్ర‌య‌త్నంలో  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. భావోద్వేగ అంశాల్ని ప్ర‌స్తావించే విష‌యంలో ఆయ‌న ఎప్పుడూ ముందుంటారు. త‌క్కువ సంద‌ర్భాల్లో వెనుక‌బ‌డినా.. అందులో విష‌యం ఉంటే మాత్రం.. వెంట‌నే వాటిని తీసుకొని అమ‌లు చేస్తుంటారు.

ఇటీవ‌ల తెలుగు భాష‌కు సంబంధించి కాల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు కేసీఆర్‌. ఇంట‌ర్ వ‌ర‌కు తెలుగు భాష‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాస్త ఆల‌స్యంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. చ‌క్క‌టి నిర్ణ‌యం కావ‌టంతో తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌శంస‌లు పొందారు.  అయితే.. ఈ త‌ర‌హా నిర్ణ‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకోక‌పోవ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అమ్మ భాషకు త‌గిన ప్రాధాన్య‌త ఇచ్చేలా బాబు కృషి చేయ‌టం లేద‌న్న మండిప‌డుతున్నారు.

ఏపీ సీఎం చేస్తున్న ఆల‌స్యం స‌రికాద‌ని ఆంధ్రోళ్లు విమ‌ర్శిస్తున్నారు. ప‌క్క‌నున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌య‌ట‌కు రాకుండానే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని.. వ‌రుస‌పెట్టి పర్య‌ట‌న‌లు చేసే బాబుకు ప్ర‌జ‌ల మైండ్ సెట్ ఏమిన్న‌ది  తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోతే మొద‌టికే మోసం ఖాయం.
Tags:    

Similar News