ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలను కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. చైనాలోని వూహన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం 80దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి, రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా మందు కూడా కనుగొనలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు కరోనా భయం ఎక్కువవుతోంది. ఇకపొతే భారత్ లోకూడా గత రెండు రోజుల నుండి కరోనా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు 29మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ 29 మందిలో రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు ఎవరు లేరు.
ఇక ఏపీలో ఇప్పటివరకు 11 కరోనా అనుమానిత కేసులు నమోదైయ్యాయని - ఈ క్రమంలో వారి నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఓ బులెటిన్ ను విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని.. విదేశాల నుంచి వచ్చిన మిగిలిన వారి నమూనాలను పుణె పంపామని తెలిపింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారికి పలు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు - రక్షణ కిట్లు - ఎన్ మాస్కులు నిల్వ ఉంచామని - రాష్ట్ర - జిల్లా స్థాయిల్లో రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామని, ప్రజల సహాయం కోసం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని - విదేశాల నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ చేశాకే ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తంగా ఏపీలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకపోవడం శుభపరిణామం అని చెప్పవచ్చు.