బాబును త‌ప్పు ప‌ట్టిన‌..ఐటీ కుర్రాడికి నోటీసులు?

Update: 2017-05-17 05:52 GMT
గ‌తంలో మీడియా చెబితేనే ప్ర‌పంచానికి తెలిసేది. మీడియాలో ఫోక‌స్ అయితేనే ఏదైనా ఇష్యూ అయ్యేది. అది గ‌తం. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. సోష‌ల్ మీడియా ఎంట్రీతో ఎవ‌రైనా త‌మ గ‌ళాన్ని వినిపించే అవ‌కాశం వ‌చ్చింది. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త అధికార‌ప‌క్షానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎవ‌రైనా స‌రే.. త‌మ అభిప్రాయాల్ని స్వేచ్ఛ‌గా పంచుకునే వేదిక సోష‌ల్ మీడియా  కావడం తో ప్ర‌భుత్వాలు ఇర‌కాటంలో ప‌డుతున్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో కొంద‌రు హ‌ద్దులు దాటుతుంటే.. మ‌రికొంద‌రిపై ఆయా ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వైఖ‌రి విమ‌ర్శలకు దారితీస్తోంది. అలాంటి విమ‌ర్శ‌లే ఎదుర్కొంటోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇటీవ‌లే బాబు స‌ర్కారుపై వ్యంగ్య కార్టూన్లు వేసే పొలిటిక‌ల్ పంచ్ సైటు నిర్వాహ‌కుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం.. అరెస్ట్ చేయ‌టం తెలిసిందే. ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇత‌ర రాష్ట్రంలో నివ‌సిస్తున్న ఒక ఐటీ కుర్రాడికి ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వ‌టంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

అత‌గాడు దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి అభిమాని. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై త‌న‌దైన శైలిలో గ‌ళం విప్పాడు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ .. సోష‌ల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటాడు. ఇత‌డి పోస్టులు త‌ర‌చూ వైర‌ల్ అవుతూ ఉంటాయి.

ఇదిలా ఉంటే..  తాజాగా స‌ద‌రు ఐటీ ఉద్యోగికి ఏపీ పోలీసుల నుంచి నోటీసులు జారీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. పోస్టులు ఆప‌క‌పోతే.. ఉద్యోగం పోగొట్టుకోవాల్సి ఉంటుంద‌న్న హెచ్చ‌రిక‌లు కూడా అత‌డు అందుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏపీ పోలీసుల వార్నింగ్ ల‌పై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ సాగుతోంది.  భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ‌ను హ‌రించేలా పోలీసులు ప్ర‌వ‌ర్తించ‌టం ఏమిట‌న్న సందేహాన్ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం చేస్తున్నారు.

 దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ నేత శ్యాంసుంద‌ర్ రెడ్డి స్పందిస్తూ... త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తే నోటీసులు జారీ చేయ‌టం స‌రికాదన్నారు. ఆ ఐటీ కుర్రాడి కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌రంగా మారిన ఈ వ్య‌వ‌హారం మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News