లేటెస్ట్ అప్డేట్ : ఏపీలో ఒక్కరోజే ఎన్ని కేసులంటే ?

Update: 2020-07-21 14:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇకపోతే , తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,944 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 1,232 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా మరో 62 మంది మరణించారు.

తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఇప్పటి వరకు 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 25,574 మంది డిశ్చార్జి కాగా, 758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం(5941), కర్నూలు(7119), గుంటూరు(6071), తూర్పుగోదావరి(7756)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పచ్ఛిమ గోదావరిలో 623 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News