రాజధానిపై జగన్ రెడీ.. బుగ్గన సారథ్యంలో కమిటీ

Update: 2019-12-29 07:11 GMT
ఏపీ రాజధాని సంగతి తేల్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు.  ఈనెల 27న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాజధానిపై తొందర ఏమీ లేదని సీఎం జగన్ మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే. జీఎన్ రావు, బోస్టన్ గ్రూపు నివేదికల తర్వాత హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రాజధానిపై తేలుస్తామన్నారు.

సీఎం జగన్ ప్రకటించినట్లే ఏపీకి 3 రాజధానుల అంశంపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు వారాల్లో నివేదికను ఇవ్వాలని  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైపవర్ కమిటీ కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తారు.  ఈ కమిటీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకతోటి సుచరిత, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని , బొత్స సత్యనారాయణలతో పాటు ఆయా శాఖలకు చెందిన ఐఏఎస్ లు, డీజీపీ గౌతమ్ సవాంగ్, అజయ్ కల్లం లు సభ్యులుగా ఉంటారు.

ఈనెల 20 లేదా 21 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఆ సమావేశాల్లోనే హైపవర్ కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.  అసెంబ్లీలోనే సీఎం జగన్ రాజధానిపై అధికార ప్రకటన చేయడానికి రెడీ అయినట్లు తెలిసింది..
Tags:    

Similar News