కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పరీక్షలు పెంచాలని, ఎక్కడ కిట్లు అందుబాటులో ఉంటే ఆయా దేశాల నుంచి నాణ్యమైన కిట్లు తెప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. అందుకు తగ్గట్లే ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి అమెరికా, మలేషియా లాంటి దేశాలు ఉపయోగిస్తున్న నాణ్యమైన లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించడం జరిగింది.
ఇకపోతే తాజాగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది. ప్రతి పది లక్షల మందికి రాజస్థాన్ 685 మందికి టెస్ట్ లు చేస్తుంటే, ఏపీలో 539 చేపడుతున్నారు. ఒక్క రాజస్థాన్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ పరీక్షలు చేస్తున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే రోజుకి పది వేల మందికి టెస్ట్ లు చేసే అవకాశం ఉంటుంది. దీనితో వచ్చే రెండు మూడు రోజులలో దేశంలోనే కరోనా టెస్ట్ లు చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది.
రెండు రోజుల కిందట వరకూ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు టెస్టుల్లో ముందంజలో ఉండగా.. మన రాష్ట్రంలో టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచడంతో రెండో స్థానానికి చేరుకుంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆదివారం విడుదల చేసిన గణాంకాలను బట్టి తేలింది. బెంగాల్‌లో మిలియన్ జనాభాకు 51 మందికే పరీక్షలు చేస్తున్నారు. అయితే , కరోనా కట్టడిలోకి రావాలి అంటే ఈ టెస్టులు సరిపోవు అని , భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.