చంద్రబాబు అరెస్ట్ పై పిటీషన్.. హైకోర్టు ఆగ్రహం

Update: 2020-02-29 07:15 GMT
విశాఖపట్నంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని.. అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఈ లంచ్ మోహన్ పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పట్ల పోలీసుల తీరు అభ్యంతరకరమని పిటీషన్ వేశారు.

విచారణకు స్వీకరించిన కోర్టు ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది. చంద్రబాబుకు సెక్షన్ 151 కింద ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఎలా ఇచ్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఇక తీవ్రమైన నేరాలకు ఇచ్చే సెక్షన్ 151 కింద చంద్రబాబు కు నోటీసులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.

ప్రజా చైతన్య యాత్ర కోసం చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు కారుపై గుడ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో చంద్రబాబు కారు దిగి రోడ్డుపై బైటాయించారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భం గా చంద్రబాబు భద్రత దృష్ట్యానే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశామని హైకోర్టు ప్రభుత్వ ఏజీ వాదించారు. కానీ దీనిని హైకోర్టు తప్పు పట్టింది. ఈ కేసు వ్యవహారం అలా లేదని వ్యాఖ్యానించింది.
Tags:    

Similar News