అధికార వైసీపీ మొత్తానికి మొత్తం సీట్లు 175 గెలుచుకుని తీరుతామని ఢంకా భజాయిస్తోంది. అయితే ఇదంతా పార్టీ వారికి జోష్ తేవడానికి తప్ప మరోటి కాదు అన్న మాట ఉంది. నిజానికి అయిదేళ్ళు పాలించిన పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ పెరిగిన తరువాత గతంలో వచ్చిన సీట్లు తగ్గుతాయి తప్ప పరిగేది ఏముంటుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పీక్స్ లో తన గ్రాఫ్ పెంచుకుంది. ఏకంగా యాభై శాతం ఓట్లు 151 సీట్లు అంటే ఏ రేర్ ఫీట్ ని ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరు అనే చెప్పాలి.
ఇక 175 సీట్లు అంటే వచ్చే ఎన్నికల్లో 130 సీట్ల దాకా అయినా వస్తాయన్న దూరాలోచన వ్యూహాలు కూడా వైసీపీకి ఉన్నాయని అంటున్నారు. సరే వైసీపీకి 175 సీట్లు రావడం పక్కన పెడితే వచ్చేసారి అధికారంలోకి రావడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో పొత్తుల రాజకీయానికి రంగం సిద్ధం అయింది. జనసేన టీడీపీ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా బరిలోకి దిగితే మాత్రం గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా మారిన గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం అంటే తొంబై శాతం సీట్లు కూటమి కొల్లగొడుతుందని లెక్కలు చెబుతున్నాయి.
ఈ రెండు పార్టీలు కలిస్తే చాలా నియోజకవర్గాలలో యాభై శాతానికి పైగా ఓటింగ్ వారి సొంతం అవుతుందని, మెజార్టీలు కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుందని 2019 ఓట్ల లెక్కలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇపుడు ఇంకా టీడీపీ జనసేనలకు ఆదరణ పెరిగింది అని అంటున్నారు. దాంతో ఈ పార్టీలు కలసి కట్టుగా వస్తే గోదావరి జిల్లాలలో ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
అయితే రాజకీయాల్లో రెండూ రెండూ నాలుగు అన్నది ఎపుడూ నిజం కాదు కాబట్టి విడిగా పోటీ చేసిన పక్షాలు కలిస్తే ప్లస్సులతో పాటు కొన్ని మైనస్సులు కూడా ఉంటాయని అంటున్నారు. ఆ మైనస్సులును పట్టుకుని వ్యూహాలను వైసీపీ రచించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఈ పొత్తుల వల్ల రెండు పార్టీలలో నెలకొన్న అసంతృప్తి కనుక పెల్లుబికితే దాన్ని సొమ్ము చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అలాగే కాపుల ఓట్లను బీసీల ఓట్లతో భర్తీ చేసుకోవడం, ముద్రగడ పద్మనాభం లాంటి వారిని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా మొత్తం ఏకపక్షం కాకుండా తమ వైపు కూడా బలం నిలుపుకునే అవకాశాలు ఉండేలా చూసుకోవడం వంటివి చేస్తుంది అంటున్నారు.
అందులో ప్రారంభంగా ఈ నెల 31న రాజమండ్రీలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం ఉంది. ఈ సమావేశం గోదావరి జిల్లాల విషయంలో వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అన్నది వెల్లడిస్తుంది అంటున్నారు. మొత్తానికి టీడీపీ జనసేన ఉమ్మడిగా వస్తే మాత్రం గోదావరి జిల్లాలలో అధికార పార్టీకి కష్టాలు మొదలైనట్లే అన్నది ప్రస్తుతానికి అందుతున్న అంచనాల మేరకు ఉన్న విషయంగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.