ఏంజెలినా జోలి.. హాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే నటిగా ఓ వెలుగు వెలిగింది. తన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. హాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈ సుందరాంగి ఇప్పుడు సినిమాలు తగ్గించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది.
ఇక ఏంజెలినా జోలి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులున్నాయి. మూడు సార్లు ఆమె వైవాహిక జీవితం బ్రేక్ అయ్యింది. చివరగా మూడేళ్ల క్రితం ఏంజెలినా.. బ్రాడ్ పిట్ నుంచి విడిపోయింది. ప్రస్తుతం చిన్న పిల్లలను దత్తత తీసుకొని పెంచుతోంది. తాజాగా ఏంజెలినా మరోసారి అందరి హృదయాలు గెలుచుకుంది.
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. యుద్ధంతో ఉక్రెయిన్ కకావికలం అవుతోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. స్వస్థలాలను విడిచి దాదాపు 30శాతం మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏంజెలినా వారందరినీ పరామర్శించేందుకు ఉక్రెయిన్ లో పర్యటించారు. భారీ బందోబస్తు నడుమ ఆమె పర్యటన కొనసాగింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ తరుఫున ప్రతినిధిగా ఏంజెలినా ఉక్రెయిన్ లోని లివివ్ నగరంలో పర్యటించారు.
ఆశ్రయం కోల్పోయిన ప్రజలు, చిన్నారులతో ముచ్చటించారు. వారిలో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది ఏంజెలినా. అక్కడి పరిస్థితులను వాలంటీర్లు ఆమెకు వివరించారు. వారిని ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఎంజెలినో చేస్తున్నట్లు తెలుస్తోంది.
లీవీవ్ నగురంలోని బేకరీలు, రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్న వారిని తిరిగి మరీ ఏంజెలినో పరామర్శించింది. యూఎన్ శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఏంజెలినా అక్కడికి వెళ్లింది. దీంతో అక్కడున్న వారు ఆమెతో తమ బాధలు చెప్పుకున్నారు..
కాగా దూసుకువచ్చే బాంబులను కూడా లెక్కచేయకుండా ఉక్రెయిన్ లో పర్యటించిన ఏంజెలినో జోలిపై ప్రశంసలు కురుస్తున్నాయి.