హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటూ.. పొద్దున పది గంటలకు ఆపీసులకు రమ్మంటే రాని పరిస్థితి. చక్కగా ఏసీ కింద కూర్చొని పని చేయమంటే.. సెల్ ఫోన్ పట్టుకొని అందులో చాటింగ్ లు.. సోషల్ మీడియా అప్డేట్స్ తో పాటు.. టిక్ టాక్ లాంటి వాటిల్లో వీడియోలు చూసుకుంటూ కిసుక్కుమని నవ్వుకోవటాలు తప్పించి ఇంకేమీ చేయని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితి ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. కొన్ని ప్రైవేటు కార్యాలయాల్లోనూ కనిపించే పరిస్థితి. ఇలాంటి రోజుల్లో తాను చేసే పని పట్ల ప్రదర్శించే కమిట్ మెంట్.. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేందుకు ఆమె పడే తపన.. అందుకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తీరు.. అందుకోసం ఆమె చేసే సాహసాల గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఆఖరకు.. ఆమెకు సలాం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? ఆమెను ఎందుకంతలా పొగిడేస్తున్నారన్నది చూస్తే.
ఆమె పేరు కమల. చేసేది ఏఎన్ ఎం. నిర్మల్ జిల్లా పెంబి పీహెచ్ సీ పరిధిలోని ఇటిక్యాల సబ్ సెంటర్లో పని చేస్తుంది. ఆమె ఉద్యోగంలో భాగంగా ఆమెకు కేటాయించిన ప్రాంతంలోని చిన్నారులకు సకాలంలో టీకాలు వేయటం. అంతే. అంత చిన్న పనికి ఇంత భారీగా పొగడాల్సిన అవసరం ఉందా? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. మొత్తం విషయం తెలిస్తే కమల గొప్పతనం ఇట్టే అర్థమైపోతుంది.
ఏఎన్ ఎంగా పని చేసే కమల తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో.. అందునా రోడ్డు అన్నది లేకుండా.. రోడ్డంతా బురదమయమైన ప్రాంతాల్లో నడుస్తూ వెళితే తప్పించి ఆమె గ్రామాలకు చేరుకోలేరు. కొన్ని గ్రామాలకు చేరుకోవటానికి.. ఆమె భారీ సాహసాల్నే చేయాల్సి ఉంటుంది. అయినా.. సై అంటారే కానీ వెనక్కి తగ్గరు.
తాజాగా ఆమె పసుపుల గ్రామంలో టీకాలు వేసేందుకు బయలుదేరారు. ఆశా వర్కర్లతో వెళ్లిన ఆమెకు వర్షం స్వాగతం చెప్పింది. అయినా వెనక్కి తగ్గలేదు. మార్గమధ్యంలో వాగు మీద బ్రిడ్జి నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఎక్కటానికి మెట్లు లేవు. ఏం చేస్తారు? నిచ్చెన తెప్పించి... ప్రమాదకరమైన ఫీట్ చేస్తూ.. నిచ్చెన మీద అడుగులో అడుగు వేసుకుంటూ అవతల వైపునకు చేరారు.
దారంతా బురదతో నిండి ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని లెక్క చేయకుండా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి.. చిన్నారులకు టీకాలు వేశారు. ఎంచక్కా బండి మీద రివ్వున దూసుకెళ్లి.. ఆఫీసుకు చేరుకొని ఏసీల కింద కూర్చొని నిమ్మళంగా పని చేయటానికి అమ్మా.. అయ్యా అనే రోజుల్లో కమల లాంటోళ్లకు హేట్సాఫ్ చెప్పటమే కాదు.. అలాంటి వారి కమిట్ మెంట్ కు సలాం చేసినా తప్పు కాదు. అంతేనా.. ఇలాంటి వారిని ప్రగతిభవన్ కు పిలిపించి.. అభినందిస్తే.. ఉద్యోగుల్లో కొత్త స్ఫూర్తి రగలక మానదు. మరి.. సారేం చేస్తారో చూడాలి.