500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం వెలువడి దేశవ్యాప్తంగా నోట్ల కటకట నెలకొన్న సమయంలోనూ గాలి జనార్దన రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. తన కూతురి పెళ్లిని కళ్లు చెదిరే రీతిలో నిర్వహించాడు. ఆ పెళ్లికి రూ.500 కోట్ల దాకా ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. మరి పాత నోట్ల చెల్లని నేపథ్యంలో గాలి పేమెంట్లు ఎలా చేశాడో అని అంతా చర్చించుకున్నారు. ఐతే గాలి ఆ సమయంలోనే రూ.100 కోట్ల రూపాయల దాకా బ్లాక్ మనీని వైట్ గా మార్చాడట. ఈ వ్యవహారంలో గాలికి సహకారం అందించి.. అతడి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి అతను ఒత్తిడి భరించలేక ఆత్మహత్యే చేసుకున్నాడు.
ఆ వ్యక్తి పేరు రమేష్. భీమా నాయక్ అనే అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేసే రమేష్.. గాలి జనార్దన రెడ్డి వంద కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ గా మార్చారని.. ఇందులో తన పాత్ర కూడా ఉందని.. 20 పర్సంట్ కమిషన్ తో నోట్ల మార్పిడికి తాను సహకరించానని రమేష్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఐతే ఈ క్రమంలో గాలి జనార్దన రెడ్డితో పాటు తాను డ్రైవర్ గా పని చేస్తున్న అధికారి తనను టార్చర్ చేశారని.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రమేష్ పేర్కొన్నాడు. ఈ నోట్ ఆధారంగా పోలీసులు గాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు గాలి కూతురి పెళ్లి అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. ఆయన్ని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఆరోపణల నేపథ్యంలో గాలి చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది.