జూన్‌లో మరో కరోనా వ్యాక్సిన్ : సీరం సీఈఓ

Update: 2021-01-30 11:53 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌‌ పంపిణీ కొనసాగుతున్న వేళ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ ఆదార్‌ పూణావాల మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్‌ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న కోవోవాక్స్‌ మంచి ఫలితాలనిస్తోందని, ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌ నాటికి కోవోవాక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పూణావాలా వెల్లడించారు.

ఈ ఏడాది జూన్ నాటికి ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. దీని నాణ్యత, సేఫ్టీ కూడా ఎక్కువేనని, త్వరలో ట్రయల్స్ కోసం ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. నోవోవాక్స్ కంపెనీతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే దేశంలో సీరం కంపెనీ నుంచి కోవిషీల్డ్, భారత్ బయో టెక్ సంస్థ నుంచి కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ప్రజలకు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16 నుంచి ఇండియా వీటి వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇప్పటివరకు  సుమారు 15 లక్షలమందికి పైగా హెల్త్ కేర్ వర్కర్లు, కొందరు డాక్టర్లు ఈ టీకామందులను తీసుకున్నారు.  విదేశాలకు సైతం భారత్‌ కోవిషీల్డ్‌ డోసులు ఎగుమతి చేస్తోంది.  

కాగా అమెరికాకు చెందిన నోవావాక్స్‌ ను 15 వేల మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగించగా, వారిలో 89.3 శాతం మందిలో కరోనాను తట్టుకునే యాంటీబాడీలు తయారయ్యాయి. ఇక 85.6 మందిలో కొత్త స్ట్రెయిన్‌ కు కూడా తట్టుకోగల సామర్థ్యం వచ్చిందని సంస్థ ప్రకటించింది. అంతేగాక దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌ పై సైతం 60 శాతం ప్రభావం చూపిందని తెలిపింది.
Tags:    

Similar News