షుగర్​, బీపీ సరసన మరో వ్యాధి..!

Update: 2021-03-03 02:30 GMT
షుగర్​, బీపీ అనేవి ఇవాళ సర్వసాధారణమైన జీవనశైలి వ్యాధులుగా మారిపోయాయి. ప్రతి ఇంట్లోనూ షుగర్​, బీపీ పేషెంట్లు ఉంటున్నారు. 40 ఏళ్లు దాటాయంటే ఈ వ్యాధి కామన్​ అయిపోయింది. షుగర్​, బీపీ అనేవి ముఖ్యంగా లైఫ్​ స్టైల్​ డిసీజులు.. కేవలం మనం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్లే వస్తున్నాయి. సాధారణంగా ఈ వ్యాధులు పల్లెప్రాంతాల్లో తక్కువగా ఉంటాయి. నగర జీవనంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వీటికి తోడు మరో వ్యాధి వచ్చి చేరింది. అదే కాలేయం చుట్టూ  కొవ్వు పేరుకుపోవడం.. సాధారణంగా  మద్యం సేవించే వాళ్లు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారట.

అయితే ఇటీవల ఆల్కాహాల్​ తీసుకోని వాళ్లలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఇందుకు ప్రధాన కారణం.. జీవనశైలి.. మనం తీసుకొనే ఆహారపదార్థాలే అని చెబుతున్నారు వైద్యులు.  జంక్​ఫుడ్​ అంటే ఫిజా, బర్గర్లు, ఫాస్ట్​ఫుడ్​ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు అంటున్నారు.  ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం.. తదితర కారణాల వల్ల 9-32 శాతం మంది భారతీయుల్లో మద్యంతో సంబంధం లేకుండా కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని పిలుస్తారని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌, తరహాలోనే ‘కాలేయంపై కొవ్వు నిల్వలు’ పెరిగిపోవడాన్ని కూడా జీవనశైలి వ్యాధుల (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌-ఎన్‌సీడీ) పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది.

ఊబకాయం, మధుమేహం ఉన్నవాళ్లల్లో  దాదాపు 40 నుంచి 80 శాతం మందిలో ఈ వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.  తొలిదశలో వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. పొట్టకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లేదా సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేసినప్పుడే బయటపడుతుంది. కేంద్రప్రభుత్వం తాజాగా ఈ వ్యాధిపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.  ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించింది, 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలని సూచించింది. బరువు తగ్గాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచించింది.
Tags:    

Similar News