కరోనా బాధితులపై మరో ఫంగస్ దాడి ..

Update: 2021-05-28 07:30 GMT
దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంటే , మరోవైపు రోజుకో ఫంగస్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వస్తూ మరింత ఆందోళనకి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ సమయంలో బ్లాక్ ఫంగస్ , ఆ తర్వాత వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత తాజాగా ఎల్లో ఫంగస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మూడు రకాల ఫంగస్ కేసులు పెరుగుతున్న సమయంలోనే ..   గుజరాత్ యొక్క వడోదరాలో మరో ఫంగల్ ఇన్ఫెక్షన్ ‘ఆస్పెర్‌గిలోసిస్’ వెలుగులోకి వచ్చింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కోవిడ్, పాజిటివ్ రోగులలో మరియు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారిలో ఇన్వాసివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వైద్యులు కనుగొన్నారు. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం..వడోదరలోని ఎస్‌ ఎస్‌ జి ఆసుపత్రిలో 'ఆస్పెర్‌ గిలోసిస్' ఎనిమిది మంది చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన డాక్టర్ షీటల్ మిస్త్రీ  ..కరోనా వైరస్ నుండి కోలుకున్న లేదా చికిత్స పొందుతున్న రోగులలో ఆస్పెర్‌ గిలోసిస్ ఇన్‌ ఫెక్షన్ కనిపించింది అని చెప్పారట. వడోదరలో కరోనా సలహాదారుగా ఉన్న డాక్టర్ మిస్త్రీ ..  స్టెరాయిడ్ల వాడకంతో పాటు 'స్టెరైల్ లేని నీటిని వాడటం వల్ల కోవిడ్ రోగులలో ఇన్వెస్టివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆస్పెర్‌ గిలోసిస్ కనిపిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే దేశంలో రోజురోజుకి బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అనేక రాష్ట్రాలు ముకోర్మైకోసిస్‌ ను మహమ్మారి వ్యాధిగా ప్రకటించాయి. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ప్రజలు మ్యూకోమైకోసిస్‌ భారిన పడతారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఫంగస్ కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా చర్మంలోకి ప్రవేశించిన తర్వాత , ఆ ఇన్ఫెక్షన్ చర్మంపై అభివృద్ధి చెందుతుంది.

శంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే కోవిడ్‌ మార్గదర్శకాలను జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 3660 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,59,459 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 2,48,93,410కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 3,660 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో ఇప్పటిదాకా 3,18,895 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 90.34శాతం ఉండగా.. మరణాల రేటు 1.16శాతం ఉంది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.
Tags:    

Similar News