ఆ గోల్ పై గగ్గోలు.. మరో 'హ్యాండ్ ఆఫ్ గాడ్'.. అయినా ఫ్రాన్స్ చేతికి కప్పు రాదు
అది 1986 ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. అర్జెంటీనా ఫుట్ బాల్ మాంత్రికుడు డిగో మారడోనా చురుగ్గా కదులుతూ ప్రత్యర్థి పని పడుతున్నాడు. ఆ సమయంలో నమోదైంది ఓ గోల్. అయితే, అది అత్యంత ఆశ్చర్యకరంగా. తీరా చూస్తే మారడోనా చేతికి తగిలి బంతి గోల్ పోస్ట్ లోకి వెళ్లినట్లు తేలింది. దీనిపై వివాదం రేగింది. కానీ, ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చివరకు మారడోనా దానిని "హ్యాండ్ ఆఫ్ గాడ్" గా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడూ అలానే ఓ గోల్ నమోదైంది. అప్పట్లో మారడోనాలాగా ఇప్పుడు అర్జెంటీనా స్టార్ మెస్సీ దీని వెనుక ఉండడం విశేషం. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ముగిసింది. అర్జెంటీనా గెలవాలన్న భారత అభిమానుల కల నెరవేరింది. మెస్సీ ప్రపంచ కప్ అందుకోవాలన్న అందరి ఆశ తీరింది. ఇక ఫైనల్ మ్యాచ్ హోరాహోరీ సాగింది.
తొలుత 79వ నిమిషం వరకు అర్జెంటీనా ఆధిక్యం 2-0. కానీ, మూడు నిమిషాల్లోపే దానిని సమం చేసింది ఫ్రాన్స్. అంతే.. అక్కడినుంచి మ్యాచ్ లో మలుపులే మలుపులు. ఓ వైపు ఎంబాపె దూకుడు.. మరోవైపు మెస్సీ హల్ చల్. హోరాహోరీ సమరంలో ఫలితం ఎటుమొగ్గుతుందో తెలియని ఉత్కంఠ. దీంతో మ్యాచ్ ఇంజూరీ సమయం దాటి అదనపు సమయంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆ గోల్.. అదనపు సమయంలోనూ ముప్పావు భాగం అయిపోయినా గోల్ కాలేదు. ఇక పెనాల్టీ షూటౌట్ తోనే విజేతను నిర్ణయించాలి అనుకుంటుండగా ఓ చమక్ జరిగింది. అర్జెంటీనాకు ఓ గోల్ పడింది. మెస్సి చేసిన ఆ గోల్‌పై ఇప్పుడు వివాదం రేగుతోంది. మ్యాచ్ అదనపు సమయలో చేసిన ఈ గోల్‌తో అర్జెంటీనా గెలుపు ముంగిటకు చేరుకొంది.
అయితే, మరికొద్ది నిమిషాల్లో ఫలితం తేలిపోతుంది అనగా.. అర్జెంటీనా ఆటగాడి మోచేతికి బంతి తగలడంతో ఫ్రాన్స్ కు పెనాల్టీ కిక్ లభించింది. దానిని ఎంబాపె స్కోరు చేశాడు. దీంతో ఇరు జట్లు 3-3తో నిలిచాయి. కాగా, మెస్సి చేసిన రెండో గోల్‌ను రెఫరీలు ఇచ్చి ఉండాల్సింది కాదని ఫ్రాన్స్ అభిమానులు వాదిస్తున్నారు. ఎప్పుడు నమోదైంది ఆ గోల్? 2-2తో స్కోరు సమమై.. మ్యాచ్ అదనపు మయంలో 108వ నిమిషంలో మార్టినెజ్ కొట్టిన బంతి ఫ్రాన్స్ గోల్ కీపర్ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. వెంటనే మెస్సి దానిని కుడికాలితో కొట్టి గోల్‌లైన్ దాటించేశాడు. దీంతో అర్జెంటీనాకు 3-2 ఆధిక్యం లభించింది. అయితే, ఇక్కడే ఓ మెలిక ఉంది. మెస్సి బంతిని కొట్టే సమయంలో అర్జెంటీనా కు చెందిన రిజర్వు ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. అప్పటికి బంతి గోల్ లైన్ దాటలేదు.
ఫిఫా నిబంధనల ప్రకారం గోల్ చేసే సమయంలో అదనపు వ్యక్తులు( గోల్ చేసిన జట్టు ఆటగాళ్లు, సబ్‌స్టిట్యూట్‌లు, అధికారులు) మైదానంలో ఉంటే గోల్‌ను రెఫరీలు అనుమతించకూడదు. రిఫరీ చూడలేదా..? ఫ్రాన్స్ కు కప్పు రాదా? గోల్ అనంతరం మ్యాచ్‌ను పునఃప్రారంభించే సమయంలోపు రెఫరీ ఈ విషయాన్ని గుర్తిస్తేనే గోల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెఫరీ సైమన్ మార్సినెక్ ఆటను చూడటంలో నిమగ్నం కావడంతో దీనిని గుర్తించలేదు. మ్యాచ్ అధికారులు కూడా పసిగట్టలేదు. కాగా, ఈ అంశంపై ఫ్రాన్స్ ఫిర్యాదు చేయొచ్చు. కానీ, ఫలితాన్ని మాత్రం మార్చలేదు. ఎందుకంటే.. మ్యాచ్ ముగియడం.. రికార్డుల్లోకి వెళ్లిపోవడం.. అంతా జరిగిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.