టెక్సాస్ లో బయటపడ్డ మరో మిస్టరీ స్థంభం .. !

Update: 2020-12-11 11:14 GMT
టెక్సాస్ లో బయటపడ్డ  మరో మిస్టరీ స్థంభం .. !
  • whatsapp icon
మోనోలిథ్‌... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అమెరికా ను ఈ మోనోలిథ్‌ వదలడం లేదు. గత కొన్ని వారాలుగా USలోని వివిధ ప్రాంతాల్లో వింతైన మోనోలిథ్ లు బయటపడుతున్నాయి. ఆ దేశంలోని ఉటా, కాలిఫోర్నియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఇలాంటివి కనిపించాయి. ఇప్పుడు టెక్సాస్ లో కూడా మరొకటి బయటపడింది. టెక్సాస్‌ లోని ఎల్ పాసో ప్రాంతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతంలో ఈ మిస్టరీ స్థంభం కనిపించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీన్ని అక్కడ ఎవరు ఏర్పాటు చేశారో తెలియదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. దాన్ని అక్కడి నుంచి తొలగించి ట్రక్కులో వేరే ప్రాంతానికి తరలించారు. అమెరికా లోని ఉటక్ ప్రాంతంలో మొదటిసారి మోనోలిథ్‌ కనిపించింది. ఆ తరువాత రొమేనియా, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, కొలంబియా , పోలాండ్ లో ఇలాంటి నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో కొన్ని కనిపించకుండా పోయాయి. మరికొన్నింటిని అధికారులు తీసివేశారు.

అమెరికాలో మోనోలిథ్‌ ఒక ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దీంతో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి టెక్సాస్‌ కు చెందిన ఆస్టిన్ కమ్యూనిటీ కాలేజీ వెల్డింగ్ డిపార్ట్‌ మెంట్ సొంతంగా మరో మోనోలిథ్‌ ను తయారుచేసి కాలేజీ క్యాంపస్‌ లో పెట్టింది. దీని ఫోటోను ACC ట్విట్టర్‌ లో పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌ వార్త అయిన మోనోలిథ్‌ గురించి విన్నారా ఇప్పుడు సెంట్రల్ టెక్సాస్‌ లో కూడా ఒక మోనోలిథ్‌ ఉంది. దీన్ని మీకోసమే ACC వెల్డింగ్ డిపార్ట్‌మెంట్ తయారుచేసింది అనే క్యాప్షన్ ‌తో మోనోలిథ్‌ వీడియోను పోస్ట్ చేశారు.
Tags:    

Similar News