కరోనా ..కరోనా ..ఈ మహమ్మారి గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. చైనాలోని వుహాన్ సిటీలో బయటపడ్డ ఈ వైరస్ ..ఆ తరువాత ఒక్కో దేశం విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 11 వేలమంది కి పైగా మరణించారు. అలాగే రెండు లక్షల మందికి పైగా ఈ కరోనా వైరస్ సోకి , హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
ఇకపోతే కరోనాతో ప్రభావితమైన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. 81 వేలకు పైగా కరోనా కేసులు.. 3 వేలకు పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోయింది. కానీ ప్రభుత్వం పట్టుదలతో పోరాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. వ్యాధికి కేంద్రమైన వుహాన్ తో పాటూ వివిధ నగరాల్లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో స్థానికంగా వ్యాధి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ తరహా కేసులు గత మూడు రోజుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు.
అయితే తాజాగా చైనాకు మరో తలనొప్పి వచ్చిపడింది. ప్రస్తుతం విదేశాల నుంచి తిరిగి వస్తున్న చైనీయుల్లో కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఇలా స్వదేశానికి తిరిగొచ్చిన వారిలో 41 మందికి కరోనా వైరస్ సోకినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా ప్రకటించింది. దీంతో చైనాలో ఈ రకమైన కేసుల సంఖ్య 269కి చేరుకుంది. వీటి సంఖ్య ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వానికి ఈ కొత్త సమస్య మరో తలనొప్పిగా మారింది.