కరోనా మహమ్మారి శరీరంలోకి ప్రవేశించిందంటే.. బాధితులు ఎంతగా ఇబ్బంది పడతారో తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే.. అది ఉన్నన్ని రోజులు నరకానికి స్పెల్లింగు రాయిస్తుంది. అధిక జ్వరం, తల నొప్పి, బాడీ పెయిన్స్, శ్వాస సమస్యలు, నోరంతా చేదుగా ఏదీ తినలేకపోవడం.. ఒంట్లో సత్తువ లేకపోవడం హబ్బో.. ఒక్కటేమిటీ సవాలక్ష సమస్యలతో ఇబ్బంది పెడుతుంది.
అయితే.. కొంత మందిలో మాత్రం ఇలాంటి సమస్యలు కనిపించవు. ఇందులో చాలా సమస్యలు ఉండకపోగా.. ఉన్నవి కూడా తక్కువ తీవ్రత కలిగిస్తాయి. శారీరక పరంగా చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా బాధితులకు ఉపశమనమే. కానీ.. ఇది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదని చెబుతున్నారు నిపుణులు.
ఇలా లక్షణాలు తక్కువగా ఉండే వారిలో కరోనా దీర్ఘ కాలికంగా ఉండిపోతుందని చెబుతున్నారు. సహజంగా కరోనా సోకిన తర్వాత 14 రోజుల్లో అది నశించిపోతుంది. అప్పటి వరకు తీసుకుంటున్న మందులతో వైరస్ ఒంట్లో నుంచి వెళ్లిపోవడంతో నెగెటివ్ రిపోర్టు వస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. కానీ.. దీర్ఘ కాలిక కరోనా వచ్చిన వారిలో చాలా కాలం పాటు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది.
ఈ సమస్యతో వందలో ఐదో వంతు మంది ఇబ్బంది పడుతున్నారని అమెరికా-ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ పరిశోధకులు వెల్లడించారు. ఇందులోనూ 19 శాతం మందిలో మరింత దీర్ఘకాలం కరోనా కొనసాగుతోందని తమ రీసెర్చ్ లో తేలిందని చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఒంటి నొప్పులు, శ్వాస సమస్యలు, బీపీ, అధిక కొవ్వు, డిప్రెషన్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నట్టు తెలిపారు. ఇందులో మెజారిటీ మహిళలు ఉన్నట్టు చెప్పడం గమనార్హం.