గడ్డం తీసేస్తే తాట తీస్తాం : తాలిబన్ల మరో రూల్ !

Update: 2021-09-29 03:30 GMT
అప్ఘాన్‌లో తాలిబన్లు తమ పైశాచికత్వం చూపిస్తున్నారు. షరియత్‌ చట్టం  పేరు చెబుతూ రోజుకో వికృత విధనాలను ప్రజల మీద బలంగా రుద్దుతున్నారు. కిడ్నాప్‌ నెపంతో హెరాత్‌ ప్రావిన్స్‌ లో మొన్న నలుగురు యువకులను కాల్చి చంపి, క్రెయిన్లకు వేళాడదీసిన కాళకేయులు, ఇప్పుడు తాజాగా మరో రూల్‌ ను తీసుకొచ్చారు. అప్ఘానిస్తాన్‌ లో మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరం అని హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల కొత్త రూల్‌ తో దేశంలని బార్బర్‌షాపుల ఓనర్ల ఒళ్లంత చెమటలు పట్టిపోయాయి.  

షరియత్‌ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్‌ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల పాలనలో నరకం అనుభవించిన అమాయక అప్ఘానీలకు ఇప్పుడు మళ్లీ అవే కష్టాలు వచ్చిపడ్డాయి.

షరియత్‌ పేరు చెబుతూ రోజుకో హింసాత్మక విధనాన్ని ప్రజల మీద బలంగా రుద్దుతున్నారు. కిడ్నాప్‌ నెపంతో హెరాత్‌ ప్రావిన్స్‌ లో మొన్న నలుగురు యువకులను కాల్చి చంపి, క్రెయిన్లకు వేళాడదీసిన కాళకేయులు, ఇప్పుడు తాజాగా మరో రూల్‌ ను తీసుకొచ్చారు. అప్ఘానిస్తాన్‌లో మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరం అని హెల్మాండ్‌ ప్రావిన్స్‌ లో ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల కొత్త రూల్‌తో దేశంలని బార్బర్‌షాపుల ఓనర్ల ఒళ్లంత చెమటలు పట్టిపోయాయి. అంతేకాదు తమ రూల్‌ పై ఫిర్యాదు చేసే అధికారం ఎవరికీ లేదని కూడా ఆర్డర్ పాస్‌ చేశారు.

హెల్మాండ్‌ లో జారీచేసిన ఫత్వా ఎఫెక్ట్‌ కాబూల్‌ లోనూ కనిపించింది. అనేక మంది బార్బర్‌ షాపుల ఓనర్లు ఇప్పటికే షెట్టర్‌ దించేశారు. కొందరికైతే తాలిబన్లు నేరుగా ఫోన్లు చేసి మరీ బెదిరించారు. దుకాణాలు మూసుకోవాడం తప్ప మరో దారి కనిపించడం లేదని బోరుమంటున్నారు బార్బర్‌ షాపుల ఓనర్లు. 2001లో తాలిబన్లు పారిపోయిన తర్వాత ఇక్కడ అమెరికన్‌ హెయిర్‌ కటింగ్‌ స్టైల్లు పాపులర్‌ అయ్యాయి. వెస్ట్రన్‌ బలగాలతోపాటు, వారి కల్చర్‌ ను కూడా ఒంటపట్టించుకున్నారు అనేక మంది అప్గానీలు. ఆడవాళ్లు తమ అందాన్న మెరుగు పర్చుకోడానికి బ్యూటీ పార్లర్లకు వచ్చేవాళ్లు. హెయిర్‌ సెలూన్లు, బ్యూటీ పార్లర్లతో పదిహేనేళ్లుగా ఉపాధి పొందిన అనేక మంది ఇప్పుడు ఆకలి చావులు చావాల్సి వచ్చింది. అసలే ఉపాది లేక ఇళ్లలో ఉన్న వస్తువులను అమ్ముకుని బతుకుతున్న అప్ఘానీలకు తాలిబన్ల తలతిక్క నిర్ణయాలు ప్రాణమీదకు తెస్తున్నాయి.
Tags:    

Similar News