అంటార్కికా ఓ విచిత్రమైన ఖండం.. ఈ ఖండంలో దాదాపు 98 శాతం మంచుతోనే కప్పబడి ఉంటుంది. కానీ రకాలైన జీవులు, చాలా తక్కువ జనాభా మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉంటుంది. ఈ ఖండంలో అక్కడక్కడా మాత్రమే కొన్ని పరిశోధనా కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఏడాది పొడవునా 1,000 నుంచి 5,000 మంది వరకు ప్రజలు నివసిస్తూ ఉంటారు. అంటార్కిటికాకు చెందిన జీవులలో అనేక రకాల ఆల్గే, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, మొక్కలు, ప్రొటిస్టా, పురుగులు, నెమటోడ్లు, పెంగ్విన్స్, సీల్స్, టార్డిగ్రేడ్లు వంటి కొన్ని జంతువులు ఉన్నాయి . వృక్షసంపద టండ్రాల్లోనే కనిపిస్తుంది.
అయితే ప్రస్తుతం అంటార్కిటా వాతావరణం పూర్తిగా మారిపోతున్నది. ఇక్కడ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఉష్టోగ్రతల్లో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. వాతావరణంలో వేడి పెరగడంతో దాని ప్రభావం ధ్రువాలపై కనిపిస్తున్నది. ధ్రువాల్లోని మంచు వేగంగా కరుగుతోంది. దీంతో సముద్రమట్టం పెరుగుతున్నది.
సముద్రమట్టం పెరగడం ఎలుగు బంట్లకు చిక్కు తీసుకొచ్చింది. ఎందుకంటే వాటికి ఆహారం దొరకడం లేదు. గతంలో ఇక్కడ నివసించే ఎలుగుబంట్లు సముద్రంలోని చేపలను వేటాడి జీవనం సాగించేవి. కానీ క్రమంగా సముద్ర మట్టం పెరగడంతో వాటికి చేపలు దొరకడం లేదు. దీంతో ఈ జీవులు ఇతర ఆహారాలపై దృష్టి సారించాయి. సముద్ర పక్షులకు సంబంధించిన గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నాయి.
అయితే, ఈ ఆహరం కారణంగా వాటి జీవన విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, వేటాడే తత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ పదుల సంఖ్యలో చదరపు కిలోమీటర్ల మంచు కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్ లో ఇక్కడ మరిన్ని మార్పులు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.