ప్రపంచకప్ లో భారత జట్టు ప్రయాణం ముగిసిన తర్వాతి రోజు నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి - వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జట్టు సెలక్షన్ - కూర్పు విషయంలో కోహ్లి - కోచ్ రవిశాస్త్రి ఏకపక్షంగా వ్యవహరించారని - తన నిర్ణయాల్ని పరిగణనలోకే తీసుకోలేదని - వాళ్ల నిర్ణయాల వల్లే జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చిందని రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని.. అందుకే జట్టు కంటే ముందు స్వదేశానికి వచ్చేశాడని గుసగుసలు వినిపించాయి.
కొన్ని రోజుల కిందట కోహ్లిని, తాజాగా అతడి భార్య అనుష్కను సోషల్ మీడియాలో రోహిత్ అన్ ఫాలో కావడం కెప్టెన్ - వైస్ కెప్టెన్ మధ్య విభేదాలనే ప్రచారానికి బలం చేకూర్చింది. మీడియాలో దీనిపై విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై కోహ్లి - రోహిత్ ఏమీ స్పందించలేదు కానీ.. అనుష్క మాత్రం నర్మగర్భంగా మాట్లాడింది. ‘‘ఒక తెలివైన వ్యక్తి ఒక సందర్భంలో ఏమీ మాట్లాడలేదు. తప్పుడు ప్రచారం ఎంత జరిగినా నిజం మాత్రమే నిశ్శబ్దంతో కరచాలనం చేస్తుంది’’ అంటూ ఆమె ఒక కోట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనుష్క సూటిగా ఏమీ చెప్పకపోయినా కోహ్లి - రోహిత్ మధ్య విభేదాలంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం అని చెప్పడమే ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది.