ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా చెప్పే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఉప ఎన్నిక ఫలితం భారతీయులందరికి హ్యాపీ న్యూస్ గా మారింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన విద్యార్థి సంఘం ఉప ఎన్నికలో భారత సంతతికి చెందిన అమ్మాయి విద్యార్థి సంఘ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 11 మంది పోటీ పడగా.. భారత సంతతి యువతి అన్వీ భూతానీ గెలుపొందారు. వర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్ష ఎన్నికకు ఉప ఎన్నిక ఏమిటంటారా? అది కూడా ఆసక్తికర అంశమే.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన రష్మీ సమంత్ గెలుపొందారు. అయితే.. సోషల్ మీడియాలో ఆమె చేసిన కొన్ని పాత పోస్టులు ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో.. స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించారు. ఇందులోనూ భారత సంతతికి చెందిన అన్వీ బరిలోకి దిగారు.
యూనివర్సీటీ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా తాజా ఉప ఎన్నికల్లో 2506 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోవటం గమనార్హం. తాజాగా వెలువడిన ఫలితాల్లో అన్వీ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన అధ్యక్షురాలు.. తాజాగా గెలుపొందిన విద్యార్థి సంఘ అధ్యక్షురాలు ఇద్దరు భారత సంతతికి చెందిన వారే కావటం విశేషం.