నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించటం ఒక పద్దతి. నేరం చేసిన వారిలో నేర ప్రవృతి తగ్గేలా వారితో వ్యవహరించటం మరో పద్దతి. నేరం చేసిన వారికి శిక్ష విధించటం తర్వాత.. నేరం చేయాలన్న ఆలోచన రావటానికే వణికేలా శిక్షలు విధించే దేశాలు కొన్ని ఉంటాయి. మరి.. అలా శిక్షలు విధించిన తర్వాత నేరాలు జరగకుండా ఉన్నాయా? అంటే లేదని చెప్పాలి. కాకుంటే.. నేరాల సంఖ్య తక్కువగా ఉందన్న మాట చెబుతుంటారు.
ఇదంతా ఎందుకంటే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ఆయనో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని బహిరంగంగా ఉరి తీస్తామంటూ పెద్ద మాట చెప్పేశారు.
భోపాల్ లో మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా కోశ్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లకు పైనే వయసుండి పెళ్లి కాని ఒంటరి మహిళలకు ఈ పథకం కింద పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహిళలు లేకుండా ఒక్క రోజు ఏ పని జరగదన్నారు. మహిళలు లేకుండా ప్రపంచం నడుస్తుందా? అసలు కుదురుతుందా? అని ప్రశ్నించిన ఆయన.. మహిళల్ని గౌరవించటం..ఆరాధించటం సంప్రదాయంగా వస్తుందన్నారు. అన్ని మాటలు బాగానే ఉన్నాయి కానీ.. బహిరంగ ఉరి మాటే బాగోలేదు. అయినా.. అంత కఠిన శిక్ష.. భారత్ లాంటి దేశంలో సాధ్యమేనా? అన్నది ప్రశ్న. ప్రచారం కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలతో విమర్శలు తప్పించి మరింకేమీ ఉపయోగం ఉండదన్నది మర్చిపోకూడదు.