వివిధ పార్టీలు మారిన వారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి చేరుతూ ఉన్నారు. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి షట్టర్లు మూసి వేయడంతో తెలుగుదేశం లోని నేతలు కమలం పార్టీలోకి చేరారు. వారిలో రాజ్యసభ సభ్యులకు విలీనం ముసుగు వేసింది బీజేపీ. ఇక తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లు పని చేసి, ఇటీవలి ఎన్నికల్లో గెలవలేకపోయిన వారు కూడా ఇప్పుడు కమలం పార్టీలో చేరిపోతూ ఉన్నారు.
మరి అలాంటి వారి చేరికలు అలా మొదలయ్యాయో లేదో.. ఇంతలోనే అక్కడ ఆధిపత్య పోరు మొదలైనట్టుగా సమాచారం. ఇప్పటికే బీజేపీ ఏపీ విభాగంలో పలు గ్రూపులున్నాయి. కులాల వారీగా, నేతల వారీగా అక్కడ గ్రూపులున్నాయని సమాచారం.
ఎన్నికలకు ముందే అలాంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు కొత్త చేరికలతో మరిన్ని గ్రూపులు ఏర్పడుతూ ఉన్నాయని సమాచారం. అవి ఇప్పుడు రాజకీయ విబేధాలుగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
బీజేపీలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనే అంశాల గురించి కొన్ని గ్రూపులు తమ ఆధిపత్యపు ధోరణిని చూపుతున్నాయట. అందులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి రానివ్వకూడదని సీఎంరమేశ్ గట్టిగా ప్రయత్నించాడని సమాచారం.
ముందుగానే బీజేపీలోకి చేరిపోయాడు సీఎం రమేశ్. తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజుల నుంచినే ఆయనకు ఆదినారాయణ రెడ్డితో విబేధాలున్నాయి. ఈ నేఫథ్యంలో ఇప్పుడు ఆదిని బీజేపీలోకి రానివ్వకూడదని రమేశ్ ప్రయత్నించాడట. అయితే ఆ ప్రయత్నాల్లో విఫలం అయినట్టుగా సమాచారం.
గత కొన్నాళ్లుగా ఆది బీజేపీ ఎంట్రీకి బ్రేక్స్ వేశాడు సీఎం రమేశ్.అయితే పూర్తిగా ఆపలేకపోయాడు. బీజేపీలోకి చేరిపోయాడు ఆది. అయితే ఆయన చేరిక సమయంలో తెలుగు రాజకీయ నేతలు ఎవరూ రాకపోవడం విశేషం. ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరిన సమయంలో కేవలం జీవీఎల్ మాత్రమే ఉన్నారు. మిగతా బీజేపీ నేతలు ఎవరూ అక్కడ లేరు.
అదంతా సీఎం రమేశ్ లాబీయింగ్ ఫలితమే అనే మాటా వినిపిస్తూ ఉంది. ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ కలలు కంటోందని.. అయితే నేతల మధ్యన మాత్రంర విబేధాలు ఇలా అప్పుడే రచ్చకు ఎక్కుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.