రాజకీయ పార్టీలు కొన్ని భ్రమలలో బతుకుతూ ఉంటాయి. ఏపీలో చూస్తే సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తోనే అంతా అన్నట్లుగా ఉంటారు. జగన్ వైఖరి చూస్తే ఫ్రీ స్కీమ్స్ సంక్షేమం అన్న దాంట్లోనే ఉంటారు. ఈ ఇద్దరు నాయకులకూ డెవలప్మెంట్ పట్టదా అన్నదే చర్చగా ఉంది. గ్రాఫిక్స్ లో అభివృద్ధిని బాబు చూస్తూంటే సంక్షేమమే సంపూర్ణ ప్రగతి అని జగన్ భావిస్తారు అని అంటారు.
ఏపీలోనే కాదు, దేశమంతా కూడా నాయకుల తీరు ఇలాగే ఉంది అనిపిస్తుంది. ప్రజలు ఏదీ డెవలప్మెంట్ అని అడుగుతూంటే నేతలు పార్టీలు మాత్రం తమ భ్రమలలో తాముంటూ జనాలను కూడా అందులో తిప్పుతూంటారు. కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన దేశ ప్రధాని బీజేపీ అగ్ర నాయకుడు నరేంద్ర మోడీ అయితే సభల్లో మాట్లాడింది ఏంటి అన్నది చూస్తే కనుక కేరళ ఫైల్స్ అనే సినిమా గురించి మాట్లాడారు, హిందూత్వ అన్నారు. భజరంగ దళ్ అని సెంటిమెంట్స్ రగిలించే ఇష్యూస్ నే టేకప్ చేశారు తప్ప కర్నాటకలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో గట్టిగా చెప్పలేకపోయారు అన్నదే చర్చగా ఉంది.
మోడీ ఎన్నో ర్యాలీలు చేశారు, సభలలో మాట్లాడారు, రోడ్ షోస్ చేశారు. కానీ ఆయన మాట్లాడిన వాటిలో ఎక్కువ అంశాలు సెంటిమెంట్స్ మీదనే తిరిగాయి అంటే ఆలోచించాల్సిందే. నిజానికి ఇంతటి సువిశాలమైన దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ప్రజలు అంతా ఎక్కువ శాతం పల్లెలలో ఉన్నారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సాధక బాధకాలలో అన్ని వర్గాల ప్రజానీకం ఉన్నారు.
అలాంటి చోట ప్రజల సమస్యలను పట్టుకుని వాటిని టార్గెట్ చేసి మాట్లాడే నాయకులే కావాలన్నది జనం మాటగా ఉంది. అభివృద్ధి మీద డిబేట్లు జరగాలి, జరిగిన అభివృద్ధి జరగాల్సిన ప్రగతి అన్న దాని మీదనే రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి.
అయిదేళ్ళ కాలంలో ఎంత చేశాం అన్నది చెబుతూ మరెంతగా చేస్తామో ప్రజలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత అయితే పార్టీలకు నేతలకు ఉంది. కర్నాటకలో జరిగిన ఎన్నికలు వాటి ప్రచారం విమర్శలు, కౌంటర్లు సెటైర్ల్జు అన్నీ చూసిన ప్రజల్జు ఇచ్చిన తీర్పును చూస్తే కనుక తమకు ఏమీ కావాలో కచ్చితంగా చెప్పారని అంటున్నారు.
ఎంత పెద్ద లీడర్ వచ్చినా ఎంత గట్టిగా మాట్లాడినా మరెంత గ్లామర్ తో అగ్ర నాయకుడు ర్యాలీలు తీసినా ప్రజలకు కావాల్సింది వారి నోట రాకపోతే ఈవీఎం మీట వేరే పార్టీకే నొక్కుతుంది అన్న పరమ సత్యాన్ని ఈ ఎన్నికలు చెప్పాయి. ఈ ఎన్నికల నుంచి దేశమంతా నేర్చుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవచ్చు.
భ్రమలలో ఉన్న నాయకులు ఉంటే కనుక అర్జంటుగా వాటి నుంచి బయటకు వచ్చి ప్రజా అజెండాతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది అన్న పాఠం అయితే ఈ ఎన్నికల ఫలితాలు చెప్పాయి. మరి నేర్చుకుంటారా మన నేతాశ్రీలు అన్నదే అసలైన ప్రశ్న.