ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు.. అరెస్ట్ లు చేయటం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముత్తయ్య ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందని.. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెప్పాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ విజయవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రాధమిక విచారణ జరిపిన అధికారులు.. ముత్తయ్య ఫోన్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మ్యాన్?.. కారు డ్రైవర్ ఫోన్ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు.
దీంతో ఇప్పటివరకూ నోటుకు ఓటు కేసులో ఇబ్బంది పడుతున్న తెలుగు తమ్ముళ్లకు భిన్నంగా.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ముఖ్యమంత్రి కుమారుడి గన్ మ్యాన్.. కారు డ్రైవర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ సిద్ధమైంది. ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదును విజయవాడ పోలీసులు ఏపీ సీఐడీకి తరలించారు. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్ మ్యాన్.. డ్రైవర్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించి.. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చూస్తుంటే.. ముత్తయ్య తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాడన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.