కొత్త స్కీం : జగనన్నకు ఫోన్ చేద్దాం

Update: 2022-10-31 15:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం మ‌రో వినూత్న రీతిలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, సంక్షేమం, న‌వ‌ర‌త్నాలు, వివిధ ప‌థ‌కాలు వంటివాటిని నేరుగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట్‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే ప్ర‌జ‌ల‌కు చేరువ కాన‌న్నార‌ని ప్ర‌భుత్వం తాజాగా కొంత స‌మాచారాన్ని లీక్‌ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి పెట్టిన పేరు .. ``జ‌గ‌నన్న‌కు చెబుతాం`` ! ఈ కార్య‌క్ర‌మాన్ని నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచే నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న‌న్న‌కు చెబుతాం! అనే కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రికి నేరుగా చెప్పుకొనే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని.. అంటున్నారు. త‌ద్వారా.. ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వానికి మ‌ధ్య మ‌రింత అనుబంధం ఏర్ప‌డుతుంద‌ని వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, వాస్త‌వానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అనుసంధానం చేసేందుకు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉంది. అదేస‌మ‌యంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కూడా ఉంది. ఇక‌, ప్ర‌తి సోమ‌వారం `స్పంద‌న‌` కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లకు మ‌ధ్య అనుబంధం ఏర్ప‌డిన‌ట్టే క‌దా!

కానీ, దీనికి మించి చేయాల‌ని అనుకుంటున్నారో.. లేక‌, ఇప్పుడు ఉన్న వ్య‌వ‌స్థ‌లు త‌న క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతున్నాయ‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారో.. తెలియ‌దు కానీ నేరుగాత‌నే రంగంలోకి దిగ‌డం మంచి ప‌రిణామ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఎవ‌రో రావ‌డం.. ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డం.. ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో.. ప్ర‌జ‌లు ఏమ‌ని అంటున్నారో.. వెళ్లి సీఎంకు చెప్పేబ‌దులు .. ముఖ్య‌మంత్రే నేరుగా ప్ర‌జ‌ల‌తోమ‌మేకం కావ‌డం.. వారితో ఫోన్లో మాట్లాడ‌డం వంటిది మంచి కార్య‌క్ర‌మ‌మే! బ‌హుశ ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు కూడా!

అయితే, ప్ర‌ధాన సందేహం ఏంటంటే.. జ‌గ‌న‌న్న‌కు చెబుతాం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు ఫోన్లు చేస్తే.. నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌నే రిసీవ్ చేసుకుంటాడా? అనేది ప్ర‌ధాన సందేహం. లేక‌పోతే.. స‌ల‌హాదారులు `లైన్‌`లోకి వ‌స్తారా?  లేక య‌థాలాపంగా అధికారులే  లైన్‌లోకి వ‌స్తారా? అనేది చూడాలి. మొత్తానికి సీఎం క‌నుక ప్ర‌జ‌ల‌కు చేరువైతే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఆయ‌న‌కు తెలిసే అవ‌కాశం ఉంటుందని అంటున్నారు. ఈ కార్య‌క్ర‌మం న‌వంబ‌రు 2న ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News