ఏపీలో చూస్తూండగానే ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. ఎన్నికలు రెండేళ్ల వ్యవధిలో తోసుకుంటూ వచ్చేస్తాయి. అందులో ఎలాంటి మార్పు ఉండబోదు. ఇక ముందస్తు ఎన్నికల ముచ్చట అంటే అది కచ్చితంగా అధికార పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఇప్పటిదాకా సాలిడ్ గా ఫలా నా పని చేశామని చెప్పుకునేందుకు లేదు. కేవలం పధకాల పేరిట డబ్బులు పంచామంటే జనాలలో వైసీపీ మీద పాజిటివిటీ రేటు పెరిగే అవకాశం అయితే లేదు.
దాంతో వైసీపీలో ఇపుడు అంతర్మధనం జరుగుతోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. రెండు నెలల క్రితం దాకా ఉన్న ధీమా ఇపుడు బాగా సడలుతోంది అని అంటున్నారు. దానికి కారణం జనాలలోకి నేతలు వెళ్ళకపోవడమే. ఒక్కసారి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లాల పరిస్థితి ఏంటో అందరికీ అర్ధమైంది. గ్రౌండ్ రియాలిటీస్ కూడా కళ్లకు కట్టినట్లుగా అవగతం అయ్యాయి.
ఇంతకాలం 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం, మనకు తిరుగులేదు, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో దాదాపుగా అయిదు కోట్ల మందిలో నాలుగున్నర కోట్ల మందికి ఏదో రూపంలో పధకాలు చేరువ అయ్యాయి కాబట్టి గెలుపు గ్యారంటీ అనుకున్నారు. ఏకంగా 175 సీట్లూ ఎందుకు గెలవలేము అన్న ప్రశ్నను కూడా వేసుకున్నారు.
అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వాస్తవాలు అర్ధమయ్యాయి. అలాగే మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర కూడా అసలు నిజాలు బయటపెట్టింది. దాంతో ఏం చేయాలో అర్ధం కావడంలేదు అంటున్నారు. ఇక ఒక విషయాన్ని కూడా ఇక్కడ ఒప్పుకుని తీరాలి. మూడేళ్ళుగా ఏపీలో అభివృద్ధి లేదు అని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని జనాలు నమ్ముతున్నారు. అదే సమయంలో ఏపీలో సంక్షేమం పేరిట అప్పులు ఎక్కువ అయ్యాయని కూడా భావిస్తున్నారు.
ఇక ఏపీలో అభివృద్ధి అంటే నాడు నేడు కార్యక్రమాలను చెబుతున్న వైసీపీ నేతలు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నది మరచిపోతున్నారు. అలాగే రెండేళ్ల పాటు కరోనా కాలంలో ఏమె చేయలేకపోయామన్న నిజాన్ని ఒప్పుకుని దాన్ని జనాలకు అర్ధమయ్యేటట్లుగా చెప్పడంలోనూ విఫలం అయ్యారు. టోటల్ గా చూస్తే మూడేళ్ళ పుణ్య కాలం గడచిపోయింది. అరవై శాతం అధికారం కరిగిపోయింది. ఇక మిగిలింది రెండేళ్ళు మాత్రమే.
ఇందులో 2024 వచ్చేస్తే కనుక ఎన్నిక వేడిలోనే అంతా ఉంటారు. కాబట్టి ఏం చేసినా ఈ ఏణ్నర్ధంలోనే చేయాలి. మరి మూడు రాజధానులు అంటూ అమరావతిని అలా ఉంచేశారు. పోలవరం డెడ్ లైన్లు అయిపోయి ఎపుడు పూర్తి అవుతుందో తెలియదు అని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. మరో వైపు విభజన హామీలను కేంద్రం నుంచి అమలు చేయించుకోలేకపొయారు. అభివృద్ధి అన్నది ఫలానా చేశామని కానీ ఫలానా ప్రాజెక్ట్ ని తెచ్చామని కానీ చెప్పుకోలేకపోయారు.
ఇదే తీరున రేపటి రోజున ఎన్నికలకు వెళ్తే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. ఏదో ఒక అద్భుతాన్నే ఈ పదవీకాలంలో చేస్తే తప్ప జనాలలోకి వెళ్లడం వైసీపీకి కష్టమవుతుంది అంటున్నారు. మరి జగన్ ఏం చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఏపీ సర్కార్ అభివృద్ధి అంటే ఏమి చూపించబోతోంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. జవాబు రాబోయే రోజుల్లో అంతా చూస్తారు, వింటారు.