అనేక వాదనలు.. అనేక మంది విశ్లేషణలు.. వీటికితోడు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి నిత్యం ఏదో ఒక రూపంలో ప్రకటనలు.. దీంతో ఇటు ప్రజల్లోనూ.. అటు వైసీపీలోనూ.. మరోవైపు..రాజకీయ మేధావుల్లోనూ విస్తృతమైన చర్చ. అదే.. ముందస్తు ఎన్నికలు. సీఎం జగన్ ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. కొన్నాళ్లుగా.. పెద్ద ఎత్తున ఏపీలో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ఏదో ఒక రూపంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. తమ్ముళ్లంతా అలెర్టుగా ఉండాలని.. ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని.. ఆయన చెబుతున్నారు.
ఇక, రాజకీయ మేధావులు కూడా ఇదే తరహా విశ్లేషణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. వీటికి అనేక రూపాల్లో అప్పులు చేస్తోందని.. అయితే.. అప్పులు పుట్టే పరిస్థితి కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇక, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని.. ప్రజాతీర్పు కోరనుందని.. విశ్లేషణలు వస్తున్నాయి.
అదేసమయంలో టీడీపీ బలోపేతం అవుతోందని.. కాబట్టి.. ఆ పార్టీ పుంజుకునేలో గానే.. వైసీపీ ఎన్నికలకు వెళ్లాలని.. నిర్ణయించుకుందని కూడా చెబుతూ వస్తున్నారు. దీంతో ఇటు ప్రజల్లోనూ.. అటు రాజకీయ వర్గాల్లోనూ.. వైసీపీ సర్కారు ముందస్తుకు వెళ్లడం ఖాయమనే వాదన వినిపించింది.
ఇక, వైసీపీ నేతల్లోనూ.. ఇదే తరహా చర్చ సాగుతోంది. ఏక్షణమైనా జగన్ ముందస్తుకు వెళ్తారని.. జూనియ ర్ నాయకులు కూడా హడావుడి చేస్తున్నారు. ఇక, గురువారం నాటి అసెంబ్లీని పరిశీలిస్తే.. మూడు రాజధా నులకు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. జగన్ సంచలన ప్రకట న చేశారు. ఒకవైపు కోర్టు ఆదేశాలు.. మరోవైపు జగన్ ప్రకటన చూసిన వారు.. ఖచ్చితంగా ఇది జరగాలంటే.. జగన్ తన ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు రద్దు చేసుకుని.. మళ్లీ ప్రజాతీర్పును కోరే అవకాశం ఉందని అనుకున్నారు.
అయితే.. అనూహ్యంగా ఇలాంటి చర్చలకు అన్నింటికీ.. జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టేశారు. తమ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కేలండర్‌ను ఆయన విడుదల చేశారు. అం టే.. వచ్చే ఏడాది మార్చి వరకు తాము ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాం.. ఏయే పథకాలకు ఎవరు అర్హులు.. ఆయా పథకాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న మొత్తాలు ఎంత? అనే సవివరణలతో కూడిన ప్రకటనను ఆయన సభ సాక్షిగా ప్రకటించారు. దీనికి బట్టి వచ్చే సంవత్సరం మార్చి వరకు జగన్ ప్రకటించినట్టు అయింది. అంటే.. అప్పటి వరకు జగన్ ప్రభుత్వం కొనసాగుతుందని స్వయంగా సీఎం చెప్పకనే చెప్పారన్నమాట. సో.. అప్పటి వరకు అంటే.. దాదాపు ఏడాది వరకు రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగనుంది.